సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ajith and Vijay: అజిత్‌ - విజయ్‌ అభిమానుల మధ్య గొడవ.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-01-12T10:30:59+05:30

ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో మరోమారు అర్థమైంది.

Ajith and Vijay
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో మరోమారు అర్థమైంది. హీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) నటించిన ‘తుణివు’(Thunivu), విజయ్‌ (Vijay) చిత్రం ‘వారిసు’ (Varisu) మూవీలు ఒకే రోజు విడుదలయ్యాయి. అయితే, ఈ చిత్రాల విడుదల సందర్భంగా ఇద్దరు హీరోల అభిమానులు (Fans) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బ్యానర్లు చింపివేశారు. భారీ కటౌట్లు కూల్చి వేశారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. రాజధాని చెన్నైతో మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు, సేలం, దిండిగల్‌ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే చెన్నైలో జరిగిన ఒక విషాదకర ఘటనలో అజిత్‌ అభిమాని విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మరికొన్ని థియేటర్‌ యజమానులు అభిమానుల అత్యుత్సాహాన్ని క్యాష్‌ చేసుకునేందుకు సినిమా టిక్కెట్లను రూ.700 నుంచి రూ.1000 చొప్పున విక్రయించారు. దీంతో అభిమానులు అర్ధరాత్రి రాస్తారోకోలు చేశారు. సేలం కొత్త బస్టాండు మల్టీప్లెక్స్‌ థియేటర్‌ అద్దాలను అభిమానులు పగులగొట్టారు. థియేటర్‌ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం తీవ్రమైన రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట జరగడంతో కొందరు అభిమానులు థియేటర్‌ అద్దాలపై పడటంతో అవి పగిలిపోయాయి. ఈ కారణంగా ఇద్దరు అభిమానులకు గాయాలయ్యాయి. మధురైలోని కొన్ని థియేటర్లలో ఈ రెండు చిత్రాల టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించడంతో అభిమానులు మధురై - ఉసిలంపట్టి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దిండిగల్‌ జిల్లాలో నకిలీ టిక్కెట్లను విక్రయించడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహించారు.

రణరంగానికి వేదిక రోహిణి థియేటర్‌..

స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో తుణివు, వారిసు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలను చూసేందుకు ఇరువురు హీరోల అభిమానులు ఈ థియేటర్‌కు భారీ సంఖ్యల తరలివచ్చారు. తొలుత తుణివు చిత్రాన్ని అర్ధరాత్రి ఒంటిగంటకు వేయగా, వారిసు చిత్రాన్ని వేకువజామున 4 గంటలకు ప్రదర్శించారు. అయితే, ఈ చిత్రాల విడుదలను ఇరువురు హీరోల అభిమానులు పోటీపడుతూ ఒక పండుగలా జరుపుకున్నారు. అదేసమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తుణివు చిత్రం బ్యానర్లను విజయ్‌ ఫ్యాన్స్‌ చింపివేశారు. దీనికి పోటీగా వారిసు బ్యానర్లను అజిత్‌ ఫ్యాన్స్‌ చింపివేశారు. దీంతో అభిమానుల మధ్య ప్రారంభమైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. పరిస్థితి చేయిదాటిపోయేలా ఉండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. చివరకు విజయ్‌ అభిమానులను ఫస్ట్ షో కోసం థియేటర్‌లోకి పంపేంత వరకు ఈ గొడవ కొనసాగింది. ఈ థియేటర్‌ చెన్నై - బెంగుళూరు జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో భారీగా తరలివచ్చిన అభిమానులతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహిణి థియేటర్‌లో తుణివు చిత్రాన్ని చూసేందుకు వెళ్ళిన చింతాద్రిపేటకు చెందిన భరత్‌కుమార్‌ (19) అనే అభిమాని విద్యుదాఘానికి మృతి చెందాడు.

కోవైలో బౌన్సర్లపై దాడి..

కోయంబత్తూరులోని పూల మార్కెట్‌ వద్ద ఉన్న అర్చనా థియేటర్‌ వద్ద భద్రతలో ఉన్న బౌన్సర్లు, అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒక దశలో అభిమానులు ఆగ్రహించి థియేటర్‌ గేట్లను కూల్చి లోపలకు వెళ్లారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి వారిని నియంత్రించారు. ఈ కారణంగా జరిగిన స్పల్ప తొక్కిసలాటలో 20 మంది వరకు అభిమానులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ రెండు చిత్రాలు విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ఏ ఒక్క ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఈ చిత్రాలను అప్‌లోడ్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆన్‌లైన్‌లో కనిపించడం నిర్మాతలను షాక్‌కు గురిచేసింది.

Updated Date - 2023-01-12T10:47:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!