World Cup Cricket: గోల్డెన్ టికెట్ అందుకున్న రజినీకాంత్
ABN, First Publish Date - 2023-09-19T16:56:01+05:30
అమితాబ్ బచ్చన్ తరువాత భారత దేశంలో గోల్డెన్ టికెట్ అందుకున్న నటుడిగా రజినీకాంత్ కి ఆ గౌరవం దక్కింది. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న సెలెబ్రిటీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లను విఐపి గ్యాలరీ కూర్చొని తిలకించవచ్చు. వారికి అన్ని సదుపాయాలు క్రికెట్ బోర్డు సమకూరుస్తుంది.
తాజాగా 'జైలర్' #Jailer విజయంతో మంచి ఉత్సహంతో వున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కి ఇంకో అరుదైన గౌరవం లభించింది. ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ #WorldCupCricket2023 భారత దేశంలో అవుతోంది, దీనికోసం క్రికెట్ అదే స్టేడియం లు అన్నీ ముస్తాబవుతున్నాయి. అక్టోబర్ 5 న తొలి మ్యాచ్ అహ్మదాబాద్ (Ahmedabad) లోని నరేంద్ర మోడీ స్టేడియం (NarendraModiStadium) లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. అయితే అక్టోబర్ 4 వ తేదీన అదే స్టేడియం లో ఓపెనింగ్ ఫంక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీస్, సింగెర్స్, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ పాల్గొనే అవకాశం వుంది.
ఇదిలా ఉండగా, భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) #BCCI గోల్డెన్ టికెట్ (GoldenTicket) అని ఒకటి పెట్టి దేశంలో వున్న అత్యుత్తమ సెలబ్రిటీస్ కి ఈ గోల్డెన్ టికెట్ అందజేస్తోంది. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న సెలబ్రిటీ దేశంలో జరిగే మ్యాచ్లను విఐపీ గ్యాలరో కూర్చొని తిలకించవచ్చు. వీరికి అన్ని సదుపాయాలు బోర్డు సమకూరుస్తుంది. మొదటి గోల్డెన్ టికెట్ భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్ గా భావించే అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) అందుకున్నారు. తరువాత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (SachinTendulkar) కి అంద చేశారు.
ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ గోల్డెన్ టికెట్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ కి అందచేసింది. అమితాబ్ తరువాత అందుకున్న నటుడిగా రజినీకాంత్ కి ఈ గౌరవం దక్కింది. బోర్డు సెక్రటరీ జై షా (JayShah) ఈ టికెట్ ని ఈరోజు రజినీకాంత్ కి అందచేశారు. ఇప్పుడు అందరూ తదుపరి ఈ గోల్డెన్ టికెట్ ఎవరికీ ఇవ్వనున్నారో అని తమ తమ ఊహాజనిత వార్తలు రాసుకుంటున్నారు.
తదుపరి టాలీవుడ్ లో ఎవరికైనా ఇవ్వొచ్చని అందులో చిరంజీవి (Chiranjeevi) ఉండొచ్చని కూడా అంటున్నారు. క్రికెట్ మ్యాచులు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఇండియాలో చాలా ప్రదేశాల్లో జరుగుతాయి.