Singam Actor: చిలకలను పెంచుకున్నందుకు.. 2.5 లక్షల జరిమానా..
ABN, First Publish Date - 2023-02-21T15:17:35+05:30
‘మారి’ (Maari), ‘సింగం’ (Singham) వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో పాపులారిటీ సాధించిన తమిళ నటుడు రోబో శంకర్.
‘మారి’ (Maari), ‘సింగం’ (Singham) వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో పాపులారిటీ సాధించిన తమిళ నటుడు రోబో శంకర్. వరుస చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతున్నాడు. ఈ నటుడు తాజాగా చిక్కుల్లో పడ్డాడు. ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ కోసం నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన్ని చిక్కుల్లో పడేసింది. ఆ ఇంటర్వ్యూలో ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ (Robo Shankar) హోమ్ టూర్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోని ఆ యూట్యూబ్ ఛానెల్ తాజాగా అప్‌లోడ్ చేసింది.
ఆ వీడియోలో రెండు అరుదైన జాతి చిలుకలు కనిపించాయి. అది గమనించిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకి ఫిర్యాదు చేశాడు. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపి.. శంకర్‌కి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. అది అలెగ్జాండ్రేన్ పారకీట్స్ (Alexandrian Parakeets) అనే అరుదైన జాతి చిలుకలు. వాటిని పెంచుకోడానికి 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ప్రత్యేక అనుమతి ఉండాలని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా పెంచుకుంటుండడంతోనే జరిమానా విధించినట్లు వారు చెప్పారు. అలాగే ఆ రెండు చిలకలను కిండిలోని పిల్లల పార్క్‌కి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Satyaraj: చిన్న సినిమాలు చాలా కష్టం.. జ్యోతిష్యాన్ని నమ్మి తీయొద్దు..
ఈ విషయంపై రోబో శంకర్ స్పందిస్తూ.. ‘దాదాపు మూడున్నరేళ్ల క్రితం నా భార్య ప్రియాంక స్నేహితులు జాబ్ కారణంగా ఊరు మారాల్సి వచ్చింది. వారికి ఈ పక్షులను తీసుకెళ్లడం కష్టం కావడంతో మాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మాకు వాటిపై ఇష్టం ఉండడంతో వాటికి ‘బిగిల్-ఎంజెల్’ అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నాం. అయితే వీటిని పెంచుకోడానికి అనుమతి ఉండాలని మాకు తెలియదు’ అని తెలిపాడు.