కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ra. Sankaran: మౌనరాగం నటుడు ఇకలేరు!

ABN, First Publish Date - 2023-12-14T16:10:01+05:30

సీనియర్‌ నటుడు, దర్శకుడు రామరత్నం శంకరన్ (92) ఇక లేరు. వయోభారంతో ఆయన గురువారం మరణించారు. ఈ విషయాన్ని దర్శకుడు భారతీరాజా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

సీనియర్‌ నటుడు, దర్శకుడు రామరత్నం శంకరన్ (92) ఇక లేరు. వయోభారంతో ఆయన గురువారం మరణించారు. ఈ విషయాన్ని దర్శకుడు భారతీరాజా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఆర్‌ఎ. శంకరన్  1931 జూలో తమళనాడులో జన్మించారు. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలుత పలువరు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. తదుపరి దర్శకుడిగా మారారు. ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్నాళ్లకు నటుడిగా మారారు. 'పెరుమైక్కురియవల్‌'(1977) ఆయన నటించిన తొలి చిత్రం. ఎన్నో చిత్రాల్లో తండ్రిగా, ఇంటికి పెద్దగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'మౌనరాగం' చిత్రంతో రేవతికి తండ్రిగా నటించింది ఈయనే! నటుడిగా 50కిపైగా చిత్రాల్లో నటించారు.

రామరత్నం శంకరన్ మరణవార్త తెలుసుకున్న కొందరు తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. దర్శకుడు భారతీరాజా ఈ మేరకు ట్వీట్‌ చేశారు. "నాకు గురు సమానులు రామరత్నం శంకరన మరణం కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-14T16:10:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!