కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Surya 43 : ఆ రూమర్స్‌కు చెక్‌ పడింది.. ఎన్ని ప్రత్యేకతలో..

ABN, First Publish Date - 2023-10-26T19:36:32+05:30

తమిళ స్టార్‌హీరో, మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్‌ పడింది. జాతీయ పురస్కారం గ్రహించిన చిత్రం ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా)తో హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ సుధా కొంగర, సూర్యతో మరో చిత్రం చేయబోతున్నారు.

తమిళ స్టార్‌హీరో సూర్య(Suriya), మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (dulquer salmaan) కలిసి ఓ సినిమా చేయబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్‌ పడింది. జాతీయ పురస్కారం గ్రహించిన చిత్రం ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా)తో హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ సుధా కొంగర (Sudha kongara), సూర్యతో మరో చిత్రం చేయబోతున్నారు. గురువారం ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా  దర్శకురాలు తన తాజా చిత్రం గురించి వెల్లడించారు. అయితే ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఉన్నారని తెలిసింది. ట్విట్టర్‌లో సుధా కొంగర దుల్కర్‌ను కూడా ట్యాగ్‌ చేసింది. అత్యధిక ప్రతిభ గల టీమ్‌తో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు సుధా. (Suriya 43)

తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. హీరోగా సూర్యకు ఇది 43వ చిత్రం. ఇందులో మలయాళ నటి నజ్రియా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక్కడో మరో ప్రత్యేకత ఉంది. జీవీ సంగీతం అందిస్తున్న వందవ చిత్రమిది. ఉత్తమ ఫీచర్‌ చిత్రం కేటగిరిలో ‘సూరారై పోట్రు’ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు సుధా కొంగర. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అవకాశం పట్ల దుల్కర్‌, విజయ్‌ వర్మ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-10-26T19:38:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!