కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shivaraj Kumar : తమ్ముణ్ణి  గుర్తు చేసుకుని భావోద్వేగంతో... 

ABN, First Publish Date - 2023-10-29T17:13:40+05:30

దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punith rajkumar) వర్థంతి సందర్భంగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (Shivaraj kumar) భావోద్వేగానికి లోనయ్యారు. జ్ఞాపకాల రూపంలో పునీత్‌ ఎప్పటికీ మన మధ్య ఉంటారని ఆయన అన్నారు.

దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punith rajkumar) వర్థంతి సందర్భంగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (Shivaraj kumar) భావోద్వేగానికి లోనయ్యారు. జ్ఞాపకాల రూపంలో పునీత్‌ ఎప్పటికీ మన మధ్య ఉంటారని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ‘‘అప్పూ మనల్ని వదిలివెళ్లిపోయాడని అందరూ చెబుతున్నారు. కానీ, నా వరకూ అతడు ఎక్కడికీ వెళ్లలేదు. జ్ఞాపకాలు, అతను చేసిన పాత్రలు, సినిమాలకు అతీతంగా చేసిన సేవల రూపంలో అతడిని సజీవంగానే ఉంచుతాం. అలా, కాకపోతే మా జీవితాలు మరింత కష్టంగా మారిపోతాయి. మా కుటుంబంలో అతడే చిన్నవాడు. మా ఇద్దరి మధ్య 13 ఏళ్ల వ్యత్యాసం ఉంది. పునీత్‌ మరణం పట్ల బాధ ఉన్నప్పటికీ ముందుకు సాగత తప్పదు. అప్పూతో ఉన్న ఆనాటి రోజులను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటా’’ అని కన్నీరుమున్నీరయ్యారు. వర్కౌట్స్‌ చేస్తున్న సమయంలో కార్డియాక్‌ అరెస్ట్‌తో 2021 అక్టోబర్‌ లో ఆయన కన్నుమూశారు.

Updated Date - 2023-10-29T17:13:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!