కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sapta Sagaralu Dhaati : 10 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి.. 

ABN, First Publish Date - 2023-09-29T12:45:02+05:30

రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ (Sapta Sagaralu Dhaati). హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు.  ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

రక్షిత్ శెట్టి(Rakshit Shetty), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ (Sapta Sagaralu Dhaati). హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు.  ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.  ఈ  నెల 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది.  మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించినంత వసూళ్లు రాబట్టలేదు. ఇంకా 10 రోజులు కూడా గడవక ముందే ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. కన్నడలో రూపొందిన  ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇప్పుడు  అందుబాటులోకి వచ్చింది.

కథ:  మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి ) ఓ ప్రేమ‌జంట‌. మ‌ను, శంక‌ర్ గౌడ (అవినాష్‌) అనే పారిశ్రామిక వేత్త ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు గాయ‌ని కావాల‌నుకుంటుంది ప్రియ‌. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఈ జంట భ‌విష్య‌త్తు గురించి అంద‌మైన క‌ల‌లు కంటూ... పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. తొంద‌ర‌గా జీవితంలో స్థిరపడొచ్చనే ఆశ‌తో చేయ‌ని త‌ప్పుని త‌నపైన వేసుకుంటాడు మ‌ను. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? క‌ల‌లు క‌న్నంత అందంగా ఈ  జంట భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దుకుందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Updated Date - 2023-09-29T12:45:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!