కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: ఆగస్టు 15 సెలవు రోజు, 'జైలర్' ఆంధ్ర, తెలంగాణ కలెక్షన్స్ చూస్తే షాక్ !

ABN, First Publish Date - 2023-08-16T12:50:06+05:30

రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. నిన్న ఆగస్ట్ 15 సెలవు దినం కావటంతో ఈ కలెక్షన్స్ ఇంకా ఎక్కువయ్యాయి, మన తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి కలెక్షన్స్ చూస్తే షాకవుతారు, అలాగే రికార్డుల దిశగా సినిమా పరిగెడుతోంది

Rajinikanth in Jailer

రజినీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్' #Jailer సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలై పెద్ద విజయం సాధించటమే కాకుండా, ఆ విజయ పరంపర ఇంకా కొనసాగుతోంది. చాలా కాలం తరువాత రజినీకాంత్ సినిమా ఇంతగా హిట్ అవటం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి. ఇది ఎవరూ ఊహించినది కాదు, అంతలా వున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్. నెల్సన్ దిలీప్ కుమార్ (NelsonDileepKumar) దీనికి దర్శకుడు, కాగా సన్ పిక్చర్స్ (SunPictures) అధినేత కళానిధి మారన్ (KalanidhiMaran) నిర్మాత. ఇందులో తమన్నా భాటియా (TamannaahBhatia), రమ్యకృష్ణ (RamyaKrishna), మిర్న మీనన్ (MirnaMenon), వసంత్ రవి (VasanthRavi) నటించారు.

ఈ సినిమా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగాలతో పాటు, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ వుండే సినిమా. ఈమధ్య కాలంలో 70 ఏళ్ళు పైబడిన రజినీకాంత్ ని దర్శకుడు నెల్సన్ 'జైలర్' #Jailer సినిమాలో చూపించినట్టుగా ఎవరూ చూపించలేదు అని అంటున్నారు. రజినీకాంత్ వెళ్లి పదిమందిని కొట్టడం, లేదా పాటలు పాడి పెద్దగా డాన్సులు చెయ్యడం లాంటివి కాకుండా రజినీకాంత్ వయసుకు తగ్గ పాత్రలో, అలాగే అతని స్టైల్, ఇమేజ్ అన్నిటినీ మ్యాచ్ చేస్తూ ఈ సినిమాలో అతని పాత్ర డిజైన్ చేసే విధానం ప్రేక్షకులకి బాగా నచ్చింది.

అందుకే విడుదలైన దగ్గర నుండీ ఈ సినిమా కలెక్షన్ల సునామీ వస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. నిన్న ఆగస్టు 15 (August15) సెలవు దినం కావటంతో ఈ కలెక్షన్స్ మొదటి రోజు ఎలా ఉన్నాయో ఆరో రోజు అయిన నిన్న అంతకన్నా ఎక్కువ వున్నాయి. సినిమా మంచి పాజిటివ్ టాక్ ఉండటం, వేరే సినిమాలు ఏమీ లేకపోవటంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి రూ. 6.10 కోట్లు షేర్ కలెక్టు చేసి రికార్డు సృష్టించింది.

మొత్తం ఆరు రోజులకు గాని ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ. 28.60 కోట్లు షేర్ కలెక్టు చేసి నిర్మాతలకు రెండింతలు డబ్బు వచ్చేట్టు చేసింది ఈ సినిమా. ఆంధ్ర, తెలంగాణ మొత్తం గ్రాస్ చూస్తే కనక రూ.49 కోట్లు ఉంటుందని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 412 కోట్లు గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టించే దిశగా వెళుతోంది. మరోసారి రజనీకాంత్ ఈ వయసులో కూడా తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించారు.

ఇది కూడా చదవండి:

Jailer film review: ఈసారి మాటలు కాదు, కోతలే.. ! అర్థమైందా రాజా !

Updated Date - 2023-08-16T13:05:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!