కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: స్నేహానికి ప్రతిరూపం నా మిత్రుడు! 

ABN, Publish Date - Dec 30 , 2023 | 06:11 PM

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అంత్యక్రియల్లో రజనీకాంత్‌ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడున్న అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం తుదిశ్వాస విడిచిన విజయకాంత్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth Final Rituals) అంత్యక్రియల్లో రజనీకాంత్‌ (Rajinikanth emotional) కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడున్న అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం తుదిశ్వాస విడిచిన విజయకాంత్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. తన మిత్రుడిని కడసారి చూసుకొని వారి అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. (Vijaykanth passed away)

ఆయన మాట్లాడుతూ ‘‘విజయకాంత్‌ మరణించారని తెలిసి నా హృదయం ముక్కలైంది. ఆయన మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు. గొప్ప సంకల్పశక్తి ఉన్న వ్యక్తి. చివరిసారిగా అతడిని డీఎండీకే మీటింగ్‌లో చూశాను. కోలుకున్నందుకు ఎంతో ఆనందించా. విజయకాంత్‌ నాకు మంచి ేస్నహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహానికి ప్రతిరూపం. ఒక్కసారి అతడితో స్నేహం చేేస్త ఎవరూ మర్చిపోలేరు. అతడి కోసం చాలామంది తమ ప్రాణాలు అర్పించడానికి సిద్థంగా ఉన్నారు. ఆయన కోపం వెనుక కూడా సరైన కారణం ఉంటుంది. స్వార్థానికి చోటుండదు"
అని అన్నారు.

 

5 నిమిషాల్లో కంట్రోల్‌ చేశాడు
‘'మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. నేను ఓసారి ఆసుపత్రిలో ఉంటే నన్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారు. వాళ్లను నియంత్రించడం ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల వల్ల కూడా కాలేదు. కానీ, విజయకాంత్‌ వాళ్లందరినీ 5 నిమిషాల్లో కంట్రోల్‌ చేశాడు. ఆ సమయంలో ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. చివరి రోజుల్లో ఆయన్ను చూడడానికి నాకు వీలుకాలేదు. వేలమంది పుడుతూ మరణిస్తూ ఉంటారు. కానీ, విజయకాంత్‌ లాంటి వాళ్లు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు రజనీకాంత్‌. 


Updated Date - Dec 30 , 2023 | 06:11 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!