RIP: ప్రముఖ తమిళ నటుడు మనోబాల ఇక లేరు
ABN, First Publish Date - 2023-05-03T14:14:37+05:30
ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్, దర్శకుడు, నిర్మాత మనోబాల ఈరోజు ఉదయం చెన్నై లో తన ఇంట్లో కన్నుమూశారు. చివరిసారిగా చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' లో జడ్జి పాత్రలో కనిపించారు
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు మనోబాల (Manobala) ఈరోజు తుది శ్వాస విడిచారు. మనోబాల 200 కి పైగా చిత్రాలలని నటించాడు, గత రెండు వారాలుగా లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని, ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నాడని, ఈరోజు బుధవారం, మే 3 వ తేదీన ఉదయం తుది శ్వాస విడిచాడని తెలిసింది. తమిళ సినిమా పరిశ్రమలో మనోబాల మరణం ఒక షాక్ కు గురిచేసిందని తెలిసింది. మనోబాల ప్రసిద్ధ కామెడీ నటుల్లో ఒకరు. 35 సంవత్సరాల సినిమా కెరీర్ లో సుమారు 200 కి పైగా సినిమాల్లో నటించి తన కామెడీ, ప్రతిభతో ప్రేక్షకులని మెప్పించారు మనోబాల.
మనోబాల తన కెరీర్ ని 1970 దశకం మొదట్లో మొదలెట్టారు. కమల్ హాసన్ ఇతన్ని రికమెండ్ చేస్తే, భారతీరాజా కి అసిస్టెంట్ గా కూడా చేసాడు. 'పుతియా వార్పుగళ్' అనే తమిళ సినిమాకి భారతి రాజా దగ్గర అసిస్టెంట్ దర్శకుడు గా పని చేసాడు. ఒక్క నటుడుగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, సీరియల్ లో కూడా నటించారు మనోబాల. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసాడు. #ManobalaPassedAway
చిరంజీవి (Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' లో (WaltairVeerayya) చివరిసారిగా కనిపించారు మనోబాల. అందులో జడ్జి పాత్రలో కనపడతారు. ఇదే అతని ఆఖరి సినిమా అని చెప్పవచ్చు. #RIPManobala అలాగే దక్షిణాది భాషలాంటిలోనూ నటించారు మనోబాల. ఇతనికి భార్య ఉష, కొడుకు హరీష్ వున్నారు. తమిళ, తెలుగు పరిశ్రమలకు చెందిన చాలామంది నటీనటులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.