Nayanathara - Vignesh: ఏడాది అంటే నమ్మశక్యంగా లేదు..
ABN, First Publish Date - 2023-06-09T12:36:53+05:30
లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కొన్నేళ్ల ప్రేమ అనంతరం గతేడాది వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే! ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు. శుక్రవారం నయన్ - విఘ్నేశ్‌ల పెళ్లి రోజు. వివాహ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి విఘ్నేశ్ ఓ పోస్ట్ పెట్టారు.
లేడీ సూపర్ స్టార్ (Lady super star) నయనతార (Nayanathara) కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) కొన్నేళ్ల ప్రేమ అనంతరం గతేడాది వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే! ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు. శుక్రవారం నయన్ - విఘ్నేశ్‌ల పెళ్లి రోజు. వివాహ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి విఘ్నేశ్ ఓ పోస్ట్ పెట్టారు. వాళ్ల ఇద్దరి పిల్లల ఫొటోలను కూడా జత చేయడంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. (One year For marriage life)
‘‘నువ్వు నా లైఫ్‌లోకి అడుగుపెట్టి అప్పుడే సంవత్సరం పూర్తయింది. ఏడాది కాలంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. ఊహించని పరాజయాలు, పరిణామాలను చూశాం. ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం. సహనానికి పరీక్ష పెట్టే ఇలాంటి ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి నిన్నూ, పిల్లల్ని చూడగానే అవేమీ గుర్తుండవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం నుంచి దక్కే బలం మరెక్కడా దొరకదు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నాకైతే నిన్ననే పెళ్లి చేసుకున్నట్లు ఉంది. అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాను. మనమిద్దరం కలిసి సాధించాల్సింది చాలా ఉంది. మన ఆనందమైన జీవితంలోకి మరో సంవత్సరానికి స్వాగతం పలుకుదాం’’ అంటూ నయనతారకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు విఘ్నేశ్ శివన్. ఆయన చేసిన పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు, అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.