Mamta Mohandas: చర్మ సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్
ABN, First Publish Date - 2023-01-15T20:45:13+05:30
స్టార్ నటి సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతోంది. ఈ అనారోగ్యం నుంచి సామ్ కోలుకోక ముందే మరొక నటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది.
స్టార్ నటి సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతోంది. ఈ అనారోగ్యం నుంచి సామ్ కోలుకోక ముందే మరొక నటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది. పాపులర్ దక్షిణాది తార మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) విటిలిగొ (Vitiligo) అనే చర్మ సమస్య బారిన పడినట్టు చెప్పింది. విటిలిగొ బారిన పడివారి చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. శరీరం రంగు మారుతూ ఉంటుంది. సమయం గడిచే కొద్ది ఆ మచ్చల పరిమాణం పెద్దదిగా అవుతుంటుంది. ఈ నేపథ్యంలో మమతా మోహన్‌దాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘‘ప్రియమైన సూర్యుడా! మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను ప్రేమగా హత్తుకుంటున్నాను. నా చర్మం రంగును కోల్పోతోంది. కాబట్టే నీ ముందుకొచ్చా. నువ్వు రాకముందే నీ కోసం నిద్ర లేచి, నీ నులివెచ్చని కిరణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నీ శక్తిని నాకు అందివ్వు. నేను నీకు రుణపడి ఉంటాను. ఇకపై ఎప్పటికీ నీపై దయతో ఉంటాను’’ అంటూ మనసు ద్రవించేలా మమతా మోహన్‌దాస్ పోస్ట్ పెట్టింది. గతంలో క్యాన్సర్ బారిన పడి మమత కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ చేదు జ్ఞాపకాలను ఆమె మరచిపోతుండగా మరో సమస్య బారిన ఆమె పడింది. ఈ అందాల భామ భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ (Yama Donga) తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘కృష్ణార్జున’, ‘కింగ్’, ‘కేడి’ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి.