The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్
ABN, First Publish Date - 2023-05-08T20:33:35+05:30
అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తమిళ నాడు (Tamil Nadu)లోని అన్ని మల్లీప్లెక్స్ థియేటర్లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించగా..
సినిమా విడుదల తర్వాత కూడా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)పై కనికరం చూపడం లేదు. సోషల్ మీడియాలో దాదాపు వారం రోజుల నుండి ట్రెండ్‌లో ఉన్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాని.. ఏ రేంజ్‌లో వివాదాలు చుట్టుముట్టాయో తెలియంది కాదు. అయితే.. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తమిళ నాడు (Tamil Nadu)లోని అన్ని మల్లీప్లెక్స్ థియేటర్లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రదర్శనలు ఆపేస్తూ.. ‘పశ్చిమబెంగాల్’ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో స్టేట్‌లో ఈ చిత్రం ఆగిపోయినట్లయింది.
‘ది కేరళ స్టోరీ’ చిత్రం వివాదాలను రెచ్చగొట్టేలా ఉందని, ఇది వక్రీకరించిన స్టోరీ అని తెలుపుతూ.. పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee).. ఈ సినిమాని నిషేధం విధిస్తున్నట్లుగా తెలిపారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) తరహాలోనే భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సినిమాని నిర్మించిందని ఆరోపిస్తూ.. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిషేధ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.
కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు? అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). విడుదలకు ముందే ఈ సినిమాపై రాజకీయ దుమారం మొదలైంది. కేరళ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరిచేలా తెరకెక్కించారనే ఆరోపణలతో.. ఈ సినిమాను బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ కోర్టులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కోర్టు అనుమతులతో ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదల తర్వాత కొన్ని చోట్ల.. ఇది అందరూ చూడాల్సిన సినిమా (#TheKeralaStoryAMustWatch) అంటూ కామెంట్స్ వినిపిస్తున్నా.. వరసగా ఒక్కో రాష్ట్రం ఈ చిత్రాన్ని నిషేధిస్తూ.. చిత్రయూనిట్‌కు షాకిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
************************************************
*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..
*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్ నుంచి ఊహించని ట్వీట్
*Balagam: ఉత్తమ నటుడు సాయిలు, ఉత్తమ సహనటుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్
*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?
*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు
*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?
*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?