2018: భారతదేశం నుంచి ఆస్కార్ కు అధికారికంగా మలయాళం సినిమా ఎంపికైంది
ABN, First Publish Date - 2023-09-27T14:35:20+05:30
భారత దేశం నుండి అధికారికంగా మలయాళం సినిమా '2018' ని వచ్చే సంవత్సరం జరగబోయే ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం పంపుతున్నారు. ఇందులో టోవినో థామస్ కథానాయకుడు, జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకుడు. కేరళ వరదల నేపథ్యంలో తీసిన సినిమా ఇది.
'ఆర్ఆర్ఆర్' #RRR సినిమా ఆస్కార్ అవార్డు (OscarAward) గెలుచుకున్నాక, వచ్చే సంవత్సరం ఆస్కార్ (Oscar2024) అవార్డులకు భారతదేశం నుండి ఏ సినిమా అధికారికంగా పంపిస్తున్నారు అన్న ఆసక్తి అందరి మదిలో మెదులుతోంది. ఈసారి చాలా భాషల నుండి చాలా సినిమాలు వచ్చాయి, అందులో మలయాళం బ్లాక్ బస్టర్ '2018' సినిమా భారత దేశం నుండి అధికారికంగా ఆస్కార్ అవార్డుకి పంపిస్తున్నట్టుగా వార్తా కధనాలు వచ్చాయి. ఈ సినిమా 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం' #BestForeignLanguage కేటగిరిలో కి పంపుతున్నారు. #BestInternationalFilm
ఈ మలయాళం సినిమా 2018 కేరళ వరదల నేపథ్యంలో తీసిన సినిమా. అందరి ప్రసంశలు అందుకోవటమే కాకుండా, ఈ సినిమా వసూళ్ళలో రికార్డు సాధించింది. ఇందులో టోవినో థామస్ (TovinoThomas) ముఖ్య పాత్ర ధరించాడు, జూడ్ ఆంథోనీ జోసెఫ్ (JudeAnthanyJoseph) దీనికి దర్శకుడు. చెన్నైలో కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి (GirishKasaravelli) అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ మొత్తం 22 సినిమాలను వీక్షించారని, అందులో ఈ '2018' సినిమాని ఎంపిక చేసారని తెలిసింది.
ఈ సినిమా కేరళకి వచ్చిన వరదల ఆధారంగా నిర్మించారు. ఇందులో భావోద్వేగాలు చాలా ఎక్కువగా వుండి, ప్రతి ఒక్కరు హీరో నే అనే టాగ్ లైన్ లో ఈ సినిమా ఉంటుంది. కేరళలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులతో పాటు, ప్రజలు కూడా ఎలా స్పందించి తోటి ప్రజలను ఎలా కాపాడుకున్నారు అన్న ఇతిచిత్రంతో ఈ సినిమా ఉంటుంది. తెలుగు సినిమాలు 'దసరా' #Dasara, 'బలగం' #Balagam, లాంటివి కూడా ఈ సినిమాతో పోటీ పడినా చివరికి '2018' ని 'ఉత్తమ అంతర్జాతీయ ఫిలిం' కేటగిరీకి ఎంపిక చేసింది.
ఇంతకు ముందు ఆమిర్ ఖాన్ #AamirKhan 'లగాన్' #Lagaan సినిమా అధికారికంగా ఎంపికయినప్పుడు చివరి వరకూ అంటే నామినేషన్స్ వరకు నిల్చింది, ఆ తరువాత మరి ఏ సినిమా కూడా చివరి వరకు నిలుచోలేదు. ఇప్పుడు ఈ '2018' ని పంపిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
2018 Film Review: కేరళ వరదల కథ!