Lokesh Kanagaraj : స్టార్‌లతో పనిచేసినా.. అలా పిలచేది ఒక్కరినే!
ABN, First Publish Date - 2023-10-08T11:04:30+05:30
‘లియో’ (Leo) సినిమా కారణంగా నటుడు విజయ్‌కు (Vijay) దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) కు మధ్య విభేదాలు తలెత్తాయని ఇప్పటికే రెండుమూడు సార్లు కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.
‘లియో’ (Leo) సినిమా కారణంగా నటుడు విజయ్‌కు (Vijay) దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) కు మధ్య విభేదాలు తలెత్తాయని ఇప్పటికే రెండుమూడు సార్లు కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. ఆ కథనాల్లో నిజం లేదని వెల్లడించారు. కేవలం ఎవరో పుట్టించి వదంతులని తెలిపారు. ఆ వార్తలు చూసి ఇద్దరం కామెడీ చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్‌లతో పని చేశా. కానీ విజయ్‌ని మాత్రమే అన్నా అని పిలుస్తానని, తమ మధ్య అంత అనుబంధం ఉందని వివరించారు. ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. డ్రగ్స్, స్మగ్లింగ్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ట్రైలర్ గురించి మాట్లాడుతూ ‘‘లియో’ ట్రెలర్‌ను మొదట విజయ్ అన్నకు చూపించా. మూడుసార్లు రిపీట్ మోడ్‌లో చూశారు. గోదాంలో విలనలతో విజయ్ ఫైట్ చేేస సీక్వెన్స్‌ను 20 రోజులు షూట్ చేశాం. నాకు తెలిసినంత వరకూ ఇలాంటి ఫైట్ సీన్‌ను ఆయన ఇప్పటివరకూ చేయలేదు. ‘ఖైదీ’, ‘విక్రమ్’లో చూపించిన విధంగా ఇందులోనూ ఓ బిర్యానీ సీక్వెన్స్ ఉంటుంది’’ అని లోకేశ చెప్పారు. ‘ఈ సినిమాకి కమల్ హాసన్ డబ్బింగ్ చెప్పారా?’ అని ప్రశ్నకు ఆ సంగతి సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. ప్రేక్షకులు, ఫ్యాన్స మెచ్చే ఎన్నో అంశాలు ఈ చిత్రం ఉన్నాయని లోకేశ కనగరాజ్ తెలిపారు.
ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే అంచనాలకు అందుకునే రీతిలో ట్రైలర్ లేదని విజయ్ ప్యాన్స నిరాశలో ఉన్నారు. అదే కారణంతో ట్రైలర్ విడుదల రోజు తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో సీట్‌లను ఽఅభిమానులు ధ్వంసం చేశారని టాక్. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్ర స్వరకర్త. ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నారు.