Lokesh Kanagaraj: ప్రొడక్షన్ హౌస్ అందుకే..
ABN, First Publish Date - 2023-12-03T13:43:40+05:30
ఒక దర్శకుడిగా తీసుకునే పారితోషికంతో తాను సంతోషంగా ఉండొచ్చని, కానీ కెరీర్ ఆరంభంలో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సహకరించిన తన స్నేహితులు, బంధులను ప్రోత్సహించేందుకే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలిపారు. ‘జి స్క్వాడ్’ సమర్పణలో రీల్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం ‘ఫైట్ క్లబ్’. నిర్మాతగా లోకేష్ కనకరాజ్‌కు ఇది మొదటి చిత్రం.
ఒక దర్శకుడిగా తీసుకునే పారితోషికంతో తాను సంతోషంగా ఉండొచ్చని, కానీ కెరీర్ ఆరంభంలో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సహకరించిన తన స్నేహితులు, బంధులను ప్రోత్సహించేందుకే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తెలిపారు. ‘జి స్క్వాడ్’ (G Squad) సమర్పణలో రీల్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం ‘ఫైట్ క్లబ్’ (Fight Club). ‘ఉరియాండి’ ఫేం విజయ కుమార్ (Vijay Kumar) హీరో. మోనిషా మోహన్ మేనన్ హీరోయిన్. అబ్బాస్ ఏ రెహమత్ దర్శకుడు. ఆదికేశన్ నిర్మాత. వసంత్ గోవింద్ సంగీతం. ఈ చిత్ర టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో లోకేష్ కనకరాజ్, అబ్బాస్, ఆదికేశన్, విజయ కుమార్, మోనీషాతో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ... ‘‘ఒక నిర్మాతగా ఇది నాకు తొలి వేదిక. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. నా కెరీర్ ఆరంభంలో స్నేహితులు, బంధువులు చేసిన సాయంతో పాటు నాకు అండగా నిలబడటం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. ఒక దర్శకుడిగా నేను తీసుకునే పారితోషికం నాకు సరిపోతుంది. కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించి, చిత్రాలు నిర్మించి, డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం లేదు. కేవలం, ఈ నిర్మాణ సంస్థ ద్వారా వచ్చే డబ్బును తిరిగి చిత్ర నిర్మాణాల కోసం వెచ్చిస్తూ, కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఖర్చు చేస్తా. ‘ఫైట్ క్లబ్’ను తమ సంస్థ తరపున విడుదల చేస్తున్నాం. నా ఎదుగుదలలో మీడియా పాత్రం కీలకం. ఈ చిత్రాన్ని చూసి నిర్మాతగానూ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. (Lokesh Kanagaraj About His Production House)
హీరో విజయ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు అబ్బాస్ ఒక సినిమా పిచ్చోడు. కరోనాకు ముందు ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. ఎన్నో అవాంతరాలను దాటుకుని మీ ముందుకు వచ్చాం.. ఆదరించాలని కోరుతున్నామని అన్నారు. హీరోయిన్ మోనీషా మాట్లాడుతూ.. అసిస్టెంట్ దర్శకురాలి నుంచి హీరోయిన్‌ని అయ్యా. ఇది నాకు తొలి తమిళ చిత్రం. ప్రతి ఒక్కరికీ నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారని అన్నారు. దర్శకుడు అబ్బాస్ మాట్లాడుతూ.. మా చిత్ర బృందానికి మీడియా ఆశీస్సులను కావాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
====================
*Dil Raju: ‘యానిమల్’ తరహా చిత్రాలను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?
*************************************
*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?
***********************************