Leo : నెగటివ్ టాక్ ఉన్నా ట్రెండింగ్‌లో.. కోలీవుడ్‌లో రికార్డ్
ABN, First Publish Date - 2023-10-20T12:36:27+05:30
పలు వివాదాలు, అడ్డంకుల మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ (leo) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. అయితే వసూళ్ల పరంగా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
పలు వివాదాలు, అడ్డంకుల మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ (leo) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. అయితే వసూళ్ల పరంగా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన ఈ చిత్రం మొదటిరోజు మంచి బిజినెస్ చేసింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం వరల్డ్‌వైడ్‌గా తొలిరోజు రూ.140కోట్లకు పైగా రాబట్టిందని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన కోలీవుడ్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. నార్త్ అమెరికాలో అక్టోబర్ 19న విడుదలైన అన్ని సినిమాల్లో ‘లియో’ టాప్‌లో నిలిచింది. కోలీవుడ్ సినిమా ఇలా ఓవర్సీస్లో టాప్ వన్‌లో కొనసాగడం చాలా అరుదు అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో విజయ్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. అభిమాన హీరో సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచి ఎన్నో వివాదాల మధ్య నలిగింది. విడుదలకు ముందుకు కూడా ఈ చిత్రానికి పలు సమస్యలు ఎదురయ్యాయి. ట్రైలర్ విడుదల తర్వాత అందులో అభ్యంతరకర డైలాగ్‌లు ఉన్నాయంటూ గొడవ చెలరేగింది తమిళనాడు ప్రభుత్వం బెనెఫిట్ షోలకు అనుమతి వ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా సినిమా సక్సెస్ అయ్యి రికార్డులు సృష్టించడంతో చిత్రబృందమంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది.