కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Keerthy Suresh- Jawan : కాలు పట్టుకోగా.. ఎగిరి గంతేసింది!

ABN, First Publish Date - 2023-09-15T10:51:34+05:30

కీర్తి సురేశ్‌..(Keerthy suresh) మహానటిగా ఎంతగా అలరించిందో తెలిసిందే! నటనే కాదు ఆమె అల్లరి (Keerthy crazy girl) కూడా ఇరగదీయగలదు. చిలిపి చేష్టలు అలాగే చేస్తుంది. తాజాగా చేసిన ఆమె చేసిన ఓ రీల్‌, అందులో ఆమె అల్లరి చేష్టలు నెటిజన్లను అలరిస్తున్నాయి.

కీర్తి సురేశ్‌..(Keerthy suresh) మహానటిగా ఎంతగా అలరించిందో తెలిసిందే! నటనే కాదు ఆమె అల్లరి (Keerthy crazy girl) కూడా ఇరగదీయగలదు. చిలిపి చేష్టలు అలాగే చేస్తుంది. తాజాగా చేసిన ఆమె చేసిన ఓ రీల్‌, అందులో ఆమె అల్లరి చేష్టలు నెటిజన్లను అలరిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సినీ ప్రియులంతా భాషతో సంబంధం లేకుండా ‘జవాన్‌’ ఫీవర్‌లో ఉన్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ‘జవాన్‌’ (jawan) సక్సెస్‌ పట్ల అందులో షారుక్‌ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌ కూడా అదే ఫాలో అవుతున్నారు. ‘జవాన్‌’ చిత్రాన్ని వీక్షించిన ఆమె తన ఆనందాన్ని దర్శకుడు అట్లీ కుటుంబంతో పంచుకున్నారు. అట్లీ ఇంటికి వెళ్లిన కీర్తి... ప్రియాంక అట్లీతో కలిసి డాన్స్‌లు వేసింది. ‘జవాన్‌’ చిత్రంలో ‘ఛలియే’ (Chaliye song)సాంగ్‌కు ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేశారు. డాన్స్‌ చేస్తుండగా అట్లీ తన పెంపుడు కుక్కపిల్ల బెక్కీతో కలిసి కీర్తి, ప్రియాంక చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా తిరిగాడు. అట్లీతో ఉన్న కుక్కపిల్లను ముద్డాడాలని గెంతుతూ ముందుకొచ్చిన కీర్తి సురేశ్‌ని బెక్కీ కాలును పట్టుకోబోయింది. అంతే ఒక్కసారిగా వెనక్కి పరుగుతీసింది సైలైంట్‌గా నిలబడిపోయింది కీర్తి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

షారుక్‌ఖాన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారులుగా అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ చిత్రం విజయవంతంగా ఆడుతోంది. ఆరు రోజుల్లో రూ.620 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-09-15T11:03:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!