Yash: దయచేసి ఓపికగా ఉండండి.. ఫ్యాన్స్‌కి రిక్వెస్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్
ABN, First Publish Date - 2023-01-06T12:12:42+05:30
గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాల్లో ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ (KGF Chapter 1)కి సీక్వెల్ కావడంతో..
గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాల్లో ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ (KGF Chapter 1)కి సీక్వెల్ కావడంతో.. ఈ మూవీపై విడుదలకి ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే విడుదల తర్వాత భారీ వసూళ్లని సాధించింది. ఈ చిత్రం కన్నడ స్టార్ (Kannada Star) యశ్ (Yash) పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
అయితే ఆ చిత్రం విడుదలై ఇప్పటికే ఎనిమిది నెలలు గడిపోయింది. కానీ ఇంతవరకు మరే సినిమాని యశ్ ప్రకటించలేదు. దీంతో కొత్త సినిమాని ప్రకటించమంటూ యశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో జనవరి 8న యశ్ 37వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ని ఓపికగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ ఓ ప్రకటనని ట్విటర్‌లో యశ్ పోస్ట్ చేశాడు.
యశ్ షేర్ చేసిన పోస్టులో.. ‘నా అభిమానులు - నా బలం.. ఏడాది పొడవునా, నా పుట్టినరోజున మీ ప్రేమ, ఆప్యాయతను ప్రదర్శించడం చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకోను. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆ రోజున మిమ్మల్ని కలుస్తుండడంతో.. నా పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా మారిపోయింది.
నాకు నమ్మకం ఉన్నది.. నచ్చింది చేయాడానికి నేను కృషి చేస్తున్నాను. నాకు మంచిగా, పెద్దగా ఆలోచించే పవర్‌ని మీరే అందించారు. నేను మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నప్పుడు.. కొన్ని వార్తలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దానికి నాకు మరికొంత సమయం కావాలి. జనవరి 8న అది చేయడం అసంభవం అనిపిస్తుంది. అందుకే ఓపికగా, సహనంతో ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను.
ఈ సంవత్సరం నా పుట్టినరోజున, నేను పట్టణంలో ఉండను. అలాగే మీ అందరినీ కలవలేను. అయితే నేను మీకు వాగ్దానం చేస్తాను. మీ వెయిటింగ్‌కి సరైన జస్టిఫికేసన్ ఇస్తానని మాత్రం మాట ఇస్తున్నాను. ప్రేమతో, యష్’ అని రాసుకొచ్చాడు. ఆ పోస్టులో కన్నడతోపాటు ఇంగ్లీషులో ఉన్న నోట్‌ని యశ్ షేర్ చేశాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో యశ్‌కి పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు.