Kabzaa Trailer: ‘తలల్ని నరికిన చేయి సృష్టించిన కథ’.. కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’ రాబోతోందా?
ABN, First Publish Date - 2023-03-05T10:20:00+05:30
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వచ్చింది.
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. దీంతో అదే బాటలో ప్రయాణిస్తూ చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకి సిద్ధమవుతున్నాయి. అందులో రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోలుగా నటించిన చిత్రం ‘కబ్జా’ (Kabzaa) ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆర్.చంద్రు (R Chandru) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది. ఈ తరుణంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని మూవీ టీం విడుదల చేసింది. ఆ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వాతంత్ర్యానికి ముందు 1945లో జరిగిన కథగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి కన్నడ నుంచి మరో కేజీఎఫ్ రాబోతుందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని.. ‘చరిత్ర ఎప్పుడు తెగిపడిన తలకంటే.. ఆ తలల్ని తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి చేయి సృష్టించిన కథే కబ్జా’.. ‘ఓ సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు. ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం’.. ‘ఇఫ్ యూ వాంట్ ప్లే మీ.. ఐ విల్ ప్లే ది గేమ్.. ఇఫ్ వాంట్ కిల్ మీ ఐ విల్ ఎండ్ ది గేమ్ (నువ్వు నాతో ఆడాలి అనుకుంటే.. నేను ఆట ఆడతా.. అదే నువ్వు నన్ను చంపాలి అనుకుంటే.. ఆటని పూర్తి చేస్తా)’.. వంటి డైలాగ్స్ వింటుంటే.. ఈ చిత్రం ఎంత మాస్‌గా ఉండబోతోందో తెలుస్తుంది. దీంతో ఈ చిత్రం కచ్చితంగా ‘కేజీఎఫ్’ రికార్డుల బద్దలు అయినట్లేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.