Kantara: కాపీ రైట్స్ చట్టం ఉల్లంఘన.. మళ్లీ నిషేధం
ABN, First Publish Date - 2023-04-15T14:11:11+05:30
ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన కన్నడ చిత్రం ‘కాంతార’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన కన్నడ చిత్రం ‘కాంతార’ (kantara) వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉత్తర కర్ణాటక గిరిజన సంప్రదాయం ఆధారంగా రిషబ్‌శెట్టి (Rishab shetty) నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిన్న సినిమాల్లో సంచలనంగా నిలిచింది. అంతా బాగానే నడిచినా ఇందులో ‘వరహా రూపం’ (varaharoopam) మాత్రం వివాదంలో చిక్కుకుంది. కాపీ రైట్ ఇష్యూ (Copy right Issue) వల్ల్ల కొన్నాళ్ల పాటు నడిచిన ఈ వివాదం సర్దుమణిగిందనుకున్నాంతా. కానీ ఇప్పుడు ఆ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. కేరళ హై కోర్టు ఈ చిత్రానికి మరో షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో వరాహ రూపం సాంగ్‌ను కాపీ కొట్టారంటూ తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తూ కోర్టు కెక్కింది. ఆ కేసు విచారణ చేపట్టిన కేరళ కోర్టు.. బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు కొట్టిపారేసింది. కొన్నాళ్ళు ఆ పాటను సినిమానుంచి తొలగించిన మేకర్స్ మళ్ళీ వరాహ రూపం పాటను సినిమాలో కలిపారు. ఇప్పుడు కేరళ హైకోర్టు ఈ సాంగ్‌ను థియేటర్స్‌లో, డిజిటల్ మాధ్యమాల్లో ఉపయోగించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాట విషయంలో చిత్ర బృందం ప్రాథమిక కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువలనే ఆ పాటను నిషేధించాలని కోర్టు తీర్పు (kerala High Court) నిచ్చింది. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలను మే 4లోపు ఆధారాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ చిత్రానికి కాంతారకు ప్రీక్వెల్ కూడా ప్రకటించారు.