Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!
ABN, First Publish Date - 2023-03-16T18:41:12+05:30
ఆస్కార్ అవార్డుతో రాజమౌళి అండ్ టీమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండగానే.. ఇప్పుడు మరో సౌత్ సినిమా ఖండాంతరాలు దాటి.. తిరుగులేని క్రేజ్‌కి కేరాఫ్ అడ్రస్..
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఆస్కార్ (Oscar) అవార్డును అందుకుని చరిత్ర సృష్టించింది. సౌత్ సినిమా (South Cinema), ముఖ్యంగా టాలీవుడ్ (Tollywood) సినిమా స్టామినా ఇదంటూ ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేసింది. ఈ అవార్డుతో రాజమౌళి అండ్ టీమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండగానే.. ఇప్పుడు మరో సౌత్ సినిమా ఖండాంతరాలు దాటి.. తిరుగులేని క్రేజ్‌కి కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఆ సినిమా ఏదో కాదు.. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. దాదాపు రూ. 400 కోట్ల కలెక్షన్స్‌ని వసూలు చేసిన ‘కాంతార’ (Kantara). ఈ సినిమా సృష్టించిన సునామీకి సినీ జనం ఔరా అన్నారు. అక్కడ, ఇక్కడ అని కాకుండా.. విడుదలైన అన్ని చోట్ల విజయఢంకా మోగించిన చిత్రంగా ‘కాంతార’ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రం మరోసారి సౌత్ సినిమా స్టామినాని ప్రపంచవ్యాప్తంగా చాటబోతోంది. స్విట్జర్లాండ్ (Switzerland)లో జెనీవా (Geneva)లో ఉన్న యూరప్ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం (మార్చి 17) ‘కాంతార’ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఈ సినిమా స్క్రీనింగ్ కోసం చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఐరాసలో ప్రదర్శించబోతున్న మొదటి కన్నడ (Kannada) సినిమా ఇదే కావడం విశేషం.
‘కాంతార’ చిత్రం ఈ గౌరవాన్ని పొందడానికి కారణం సినిమాలో ఉన్న కంటెంటే. యూనివర్సల్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో ఐరాస (United Nations)లో ‘కాంతార’ని స్ర్కీనింగ్‌కు ఎంపిక చేశారు. దీంతో సౌత్ సినిమాకి దక్కిన గొప్ప గౌరవంగా దీనిని సినీ ప్రముఖులు, విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతుంది. ఇటీవల ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినా కూడా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఏదో రకంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇదంతా కేవలం సినిమాలోని కంటెంట్‌తోనే సాధ్యమైంది. అదే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో స్ర్కీనింగ్ చేసేలా చేసింది. ఐరాస పాథె బలెక్సెర్ట్ హాల్ నంబర్ 13లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఐరాస ప్రముఖులందరూ హాజరకానున్నారు. వారందరితో కలిసి రిషబ్ శెట్టి ఈ సినిమాని చూడనున్నారు. ఈ సినిమా ప్రదర్శన అనంతరం రిషబ్ శెట్టి భారీ స్పీచ్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. (Kantara to be screened at UN in Geneva on March 17)
ఈ స్పీచ్‌లో.. ‘కాంతార’ సినిమా (Kantara Movie) చిత్రీకరణ జరిగిన ప్రధాన అంశమైన అడవుల పరిరక్షణ.. అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల యొక్క సమస్యలు, అడవులలో ఉండే వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన రక్షణ వంటి విషయాలపై ఆయన మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఎక్కడ చూసినా, విన్నా సౌత్ సినిమాల ప్రస్తావనే వినబడుతుండటంతో.. ప్రపంచ సినిమానే సౌత్‌పై దృష్టి పెట్టిందనేలా అంతటా టాక్ మొదలైంది. రీసెంట్‌గా హాలీవుడ్ ప్రముఖులు సైతం దర్శకధీరుడితో ప్రత్యేకంగా సమావేశమై.. అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రిషబ్ శెట్టి ఐరాసలో సౌత్ గొప్పతనాన్ని చాటబోతున్నారు. ఇదంతా చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ సినిమా (South Indian Cinema)కు మరింత అగ్రస్థానం లభించనుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేలా సినీ ప్రముఖులు, ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. (Kantara Special Screening at UN)
ఇవి కూడా చదవండి:
*********************************
*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..
*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది
*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి
*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..
*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?
*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది
*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?