Kannada cini industry: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ
ABN, First Publish Date - 2023-02-13T17:09:08+05:30
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు. ప్రధాని మోదీ కర్ణాటకలో ఐదు రోజుల పాటు పర్యటిస్తున్నారు.
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు. ప్రధాని మోదీ కర్ణాటకలో ఐదు రోజుల పాటు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రాజ్ భవన్‌లో ఏరో ఇండియా పోగ్రామ్‌ని ప్రారంభించారు. అనంతరం కొంత మంది సెలబ్రీటీలకు రాజ్ భవన్‌లో విందు ఇచ్చారు. ఈ విందులో సినీ, క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur), యష్ (Yash), రిషబ్ శెట్టి (Rishab Shetty), అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, శ్రద్ధ్రా జైన్ తదితరులను ప్రధాని మోదీ కలుసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలు అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ఫొటోలను రిషబ్ శెట్టి, యష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రధాని మోదీని కలుసుకోవడం అద్భుతంగా ఉంది. ఇండియా, కర్ణాటక అభివృద్ధిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ పాత్రపై మేం చర్చించాం. మీ లీడర్‌షిప్‌లో బెటర్ ఇండియాను నిర్మించడానికి మా వంతు సహాయాన్ని అందించడం గర్వంగా ఉంది’’ అని రిషబ్ పేర్కొన్నారు. గతేడాదంతా కన్నడ ఇండస్ట్రీ హవా నడిచిందని చెప్పొచ్చు. శాండల్ వుడ్ నుంచి వచ్చిన ‘కెజియఫ్’, ‘కాంతార’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. ‘కెజియఫ్’ (KGF) లో యష్, ‘కాంతార’ లో రిషబ్ శెట్టి హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్నాళ్ల క్రితమే మరణించారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని అశ్విని పునీత్ కొనసాగిస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో విధిస్తున్న లే ఆఫ్‌లపై శ్రద్ధా జైన్ కామెడీ వీడియోలు చేశారు. ఈ వీడియోలతో శ్రద్ధ ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు. అందువల్ల ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రధాని మోదీ వీరిని ఆహ్వానించి విందును ఇచ్చారు.