Keraleeyam2023: ఒకే వేదికపై నట దిగ్గజాలు.. చూడడానికి రెండు కళ్లు చాలవు
ABN, First Publish Date - 2023-11-01T17:15:14+05:30
ముగ్గురు మేరు నగధీరులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. ఎన్నాల్టీకో గానీ జరగని ఇలాంటి ఆరుదైన దృశ్యం భుధవారం ఆవిస్కృతం అయింది. దశాబ్ధాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఫిల్లర్లుగా పిలవబడే కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటదిగ్గజాలు ఓకే వేదికపై ఒకే స్టైల్లో కనిపించడంతో వారిని చూడడానికి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు.
ముగ్గురు మేరు నగధీరులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. ఎన్నాల్టీకో గానీ జరగని ఇలాంటి ఆరుదైన దృశ్యం భుధవారం ఆవిస్కృతం అయింది. దశాబ్ధాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఫిల్లర్లుగా నిలబడి తమదైన నటనతో అలరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్‌హాసన్ (Kamal Haasan), మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) వంటి నటదిగ్గజాలు ఓకే వేదికపై ఒకే స్టైల్లో కనిపించడంతో వారిని చూడడానికి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు.
నవంబర్ 1 కేరళ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో వీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో హజరై కనుల విందు కలిగించారు. కేరళ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ గురించి, పురోగతి, సాధించిన విజయాలు, వారి కళలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం 'కేరళీయం (Keraleeyam2023) అనే కార్యకమాన్ని అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నది.
నవంబర్ 1 నుంచి 7 వరకు తిరువనంతపురంలో జరగనున్న ఈ కార్యకమంలో కేరళీయం 'బెస్ట్ ఆఫ్ కేరళ పేరిట సమావేశాలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ వంటి ఉత్సవాలు చేపడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పిలవబడే ఈ కేరళీయం వేడుకకు ఈ సంవత్సరం కమల్‌హసన్ (Kamal Haasan)ను ముఖ్య అతిథిగా ఆహ్వనించడంతో ఆయన తెల్ల చొక్కా, పంచకట్టులో కార్యకమంలో పాల్గొన్నారు. ఒకే ఫ్రేములో స్టైలిష్ లుక్‌లో కనిపించిన కమల్‌హసన్, మమ్ముటి, మోహన్ లాల్ స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.