కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Celebs on Vijayakanth Death: అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు!

ABN, Publish Date - Dec 28 , 2023 | 02:20 PM

డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్‌ మరణం వార్తతో కోలీవుడ్‌తోపాటు సౌత్  సినిమా ఇండస్ట్రీ  తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. సినీలోకం కెప్టెన్ అని పిలుచుకునే మనిషి దూరమయ్యాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు పలు సినీ సెలబ్రిటీలు విజయకాంత్ కు  సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్‌ మరణం వార్తతో కోలీవుడ్‌తోపాటు సౌత్  సినిమా ఇండస్ట్రీ  తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. సినీలోకం కెప్టెన్ అని పిలుచుకునే మనిషి దూరమయ్యాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు పలు సినీ సెలబ్రిటీలు విజయకాంత్ కు  సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

"మన ‘పురట్చి కలైంగర్‌’, ‘కెప్టెన్‌’ విజయకాంత్‌ ఇకలేరని తెలిసి గుండె బద్దలైనట్టయింది. ఆయన గొప్ప వ్యక్తి. మాస్‌ హీరో. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. తెలివైన రాజకీయ నాయకుడు. డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించనప్పటికీ ఇక్కడ కూడా ఎంతోమంది సినీ ప్రేమికుల ప్రేమను పొందారు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి శూన్యాన్ని మిగిల్చారు. ఆయన అభిమానులకు, కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి (Chianjeevi) ట్వీట్‌ చేశారు. 

విజయకాంత్‌ (Rip VIjayakanth) గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ కథాంశాలతోపాటు సామాజిక, అంశాల మేళవింపుతో యాక్షన్  చిత్రాలు ఎక్కువ చేశారు. ఆపదలో ఉన్న వారిపట్ల మానవతా దృక్పథంతో స్పందించేవారు. ఆయనకు తొలి అడుగులో ఎదురైన ఫలితానికి అధైర్యపడక  రాజకీయాల్లో నిలబడ్డారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ తత్వంతోనే తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం వహించారు. విజయకాంత్‌ గారిని చివరిసారి 2014లో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో కలిశాను. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగ్గ నాయకుడు అని ఎందరో భావించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి శ్రీమతి ప్రేమలత గారు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’’.

- పవన్  కల్యాణ్‌ (pawan kalyan)

"నా మిత్రుడు, దిగ్గజ నటుడు విజయకాంత్‌ మృతి చెందడం బాధాకరం.  చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతో లెక్కలేనన్ని క్షణాలు గడిపాను. ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం. ఆయనతో బంధం నా జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’

 - మోహన్‌బాబు

విజయకాంత్‌ గారి మరణం విచారకరం. ఆయన జ్ఞాపకాలతో ఆయన కుటుంబసభ్యులు సాంత్వన పొందాలని , భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా

- రవితేజ

నా మొదటి సినిమానే విజయకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఎన్నో సలహాలిచ్చారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి  ఉంటా. 

- సోనుసూద్‌


Updated Date - Dec 28 , 2023 | 02:20 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!