సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kiccha Sudeep: రాజకీయాల్లోకి మీరు రావొద్దు, వెల్లువలా అభిమానుల వినతి

ABN, First Publish Date - 2023-04-05T15:56:43+05:30

కిచ్చ సుదీప్ రాజకీయాల్లోకి రావాలా వద్ద అన్న విషయం గురించి అతను అభిమానులు ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు. మరి అభిమానుల మాటను సుదీప్ గౌరవిస్తాడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ (Kiccha Sudeep) రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్న వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కిచ్చ బీజేపీ (BJP) కి కేంపైన్ కూడా చేస్తాడు #KicchaSudeep అని వార్తలు బాగా వచ్చాయి. అయితే సుదీప్ మాత్రం దాని మీద ఏమీ స్పందించలేదు. రాజకీయాల్లో చేరతాను, చేరను అని చెప్పకుండా ఒక్కసారి తన అభిమానులను కూడా అడిగి చెపుతా అని అన్నాడు. అలాగే అతను ఈసారి తన స్నేహితుల కోసం మాత్రమే ఎన్నికల్లో ప్రచారం చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. #KicchaSudeep #KicchaBOSS

ఇవన్నీ ఇలా ఉంటే, సాంఘీక మాధ్యమాల్లో మాత్రం కిచ సుదీప్ అభిమానులు వెల్లువలా సుదీప్ కి రాజకీయాల్లోకి రావొద్దు అని చెపుతున్నారు. అలాగే వాళ్ళు #WeDontWantKicchaInPolitics కిచ్చ రాజకీయాలకు వద్దు అనే హేష్ టాగ్ కూడా వైరల్ చేశారు. ఎందుకంటే అభిమానులకు సుదీప్ రాజకీయాల్లోకి రావటం అసలు ఇష్టం లేనట్టు కనపడుతోంది.

మామూలుగా అయితే రాజకీయాల్లోకి వచ్చిన నటులు అందులో బాగా షైన్ అయిన సంఘటనలు మాత్రం ఈమధ్య లేవు. అప్పుడెప్పుడో ఎం.జి.ఆర్ (MGR), తరువాత ఎన్టీఆర్ (NTR), జయలలిత (Jayalalitha) ఇలా కొంతమందిని వేళ్ళమీద లెక్కపెట్టగలిగే నటులు మాత్రమే రాజకీయాల్లో బాగా రాణించి ముఖ్యమంత్రులుగా ఉన్నత పదవులు పొందారు.

ఆ తరువాత చిరంజీవి (Chiranjeevi) లాంటి మాస్ ఇమేజ్ వున్న నటుడే రాజకీయాలు తన వలన కాదు అని తప్పుకున్నాడు. రజనీకాంత్ (Rajinikanth) కూడా రాజకీయాల్లోకి రావాలన్న తపన చాలా కాలం ఉండినా, అందులోకి రాలేకపోయాడు. ఇంక కమల్ హాసన్ (Kamal Haasan) ఎక్కడున్నాడో ఇప్పుడు తెలీదు. #WeDontWantKicchaInPolitics అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభిమానులు కిచ్చ సుదీప్ ని రాజకీయాలు వద్దు అని అంటున్నారు. వాళ్ళు అన్నది కూడా కరెక్టేనేమో. అయితే అభిమానుల సపోర్ట్ లేకుండా ఎటువంటి ఎంతటి పెద్ద నటుడు అయినా ఎక్కడా రాణించలేదు అన్నది అందరూ అనే మాట కదా !

Updated Date - 2023-04-05T15:56:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!