Dulquer Salmaan: ఆ సినిమాల తర్వాతే లేడీ ఫ్యాన్స్ పెరిగారు!
ABN, First Publish Date - 2023-08-19T21:50:40+05:30
వేదికపై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) చెప్పారు. ఆమె ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడినట్లు తెలిపారు. ఓకే బంగారం’, ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారిపోయారు.
వేదికపై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) చెప్పారు. ఆమె ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడినట్లు తెలిపారు. ఓకే బంగారం’, ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారిపోయారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన ఇబ్బంది గురించి చెప్పారు. ‘‘ఓకే కన్మణి’, ‘సీతారామం’ (Sita ramam) చిత్రాల తర్వాతే నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మామూలుగా నాకు బాయ్స్లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. నేను ఎప్పుడూ వాళ్లతోనే టచ్లో ఉంటా. అభిమానుల వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓసారి ఓ ఫంక్షన్లో కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయా. గతంలో ఒక పెద్దావిడ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డా. ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది. ఆ సందర్భంలో నాకు ఎంతో బాధనిపించింది’’ అని దుల్కర్ చెప్పారు.
ఇటీవల ‘కింగ్ ఆఫ్ కోథా’ (king of Kotha) ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘అవి రానా పర్సనల్ కామెంట్ కాబట్టి నేను దానిపై మాట్లాడాలనుకోవడం లేదు. ఈ పరిశ్రమలో నాకు మంచి స్నేహితులు ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. నేను దేనిపై ఫిర్యాదు చేయను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా. రానా.. ఆ విషయాన్ని చెప్పాలని అనుకుని ఉండరు. స్టేజ్ పైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ చెప్పారనుకుంటున్నా. అందుకే ఆయన క్షమాపణ కూడా చెప్పారు’’ అని అన్నారు.
దుల్కర్ తన భార్య గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘‘28 ఏళ్ల వయసులోనే నాకు వివాహమైంది. అమాల్ సోఫియా, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను నా జీవితంలో భాగమని తనని కలిసినప్పుడే అర్థమైంది అంతకుముందు ఎప్పుడూ ఏ అమ్మాయిని చూసినా నాకు ఈ ఫీలింగ్ కలగలేదు. పెళ్లి, కెరీర్.. నాకు ఒకే సమయంలో మొదలయ్యాయి. పెళ్లైన కొద్దిరోజుల్లోనే రెండో సినిమా షూటింగ్లో అడుగుపెట్టా. ఏ మాత్రం విరామం దొరికినా నా భార్యతో గడపటానికి ఇష్టపడుతుంటా’’ అన్నారు.