కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Comedian Jayamani : సినీ నటుడు జయమణి అరెస్టు

ABN, First Publish Date - 2023-10-21T11:07:46+05:30

నటుడు జయమణిని గిండి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మార్నింగ్‌ వాకింగ్‌ సమయంలో ఒక న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారంటూ...

నటుడు జయమణిని(Jayamani) గిండి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మార్నింగ్‌ వాకింగ్‌ సమయంలో ఒక న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కాగా జయమణి... సీనియర్‌ హీరోలు గౌండమణి, సెంథిల్‌, వడివేలు వంటి నటులతో కలిసి చిన్న చిన్న హాస్య పాత్రలు చేశారు. ఇపుడు చిత్ర పరిశ్రమలో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-10-21T11:07:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!