ChiyaanVikram: విక్రమ్ కి గాయాలు, కోలుకుంటున్నాడు
ABN, First Publish Date - 2023-05-03T13:28:10+05:30
చియాన్ విక్రమ్ ఒక సన్నివేశం రిహార్సల్ చేస్తూ ఉండగా పడిపోయినపుడు పక్కటెముక విరిగిపోయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు, రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని అతను చేయాల్సిన తంగలన్ సినిమా షూటింగ్ వాయిదా పడింది
గత వారం విడుదల అయిన 'పొన్నియిన్ సెల్వన్ 2' (PonniyinSelvan 2) సినిమాలో కథానాయకుడిగా వేసిన నటుడు చియాన్ విక్రమ్ (ChiyaanVikram) కి గాయాలయ్యాయి. ఒక సన్నివేశం రిహార్సల్స్ చేస్తూ ఉండగా పక్కటెముక చిన్నగా విరిగిపోవటంతో వెంటనే విక్రమ్ ను దగ్గరలో వున్న ఆసుపత్రి కి తీసుకెళ్లటం జరిగింది. ప్రస్తుతం విక్రమ్ కోలుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. అందువల్ల తను చెయ్యవలసిన 'తంగలన్' #Thangalan సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నాడని చెప్పారు.
మని రత్నం (ManiRatnam) దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' (PonniyinSelvan) చారిత్రాత్మక సినిమా రెండు పార్టులుగా విడుదల అయింది. అందులో ఆదిత్య కరికారాన్ (AdityaKarikaran) పాత్ర విక్రమ్ పోషించాడు, అందరి మెప్పు కూడా పొందాడు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాయాల ప్రకటన కూడా అందులోనే చేసాడు.
దీనివల్ల కొన్ని రోజులు రెస్ట్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు విక్రమ్ కి సూచించినట్టు తెలిసింది. త్వరలోనే మళ్ళీ అందరినీ కలుసుకుంటాను అని చెప్పాడు. అలాగే షూటింగ్ లో కూడా త్వరలో పార్టిసిపేట్ చేస్తానని కూడా అన్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కేవలం రెస్ట్ తీసుకోమన్నారని ఆ ప్రకటనలో చెప్పారు.