The elephant whisperers - Bomman Family: మాటిచ్చి తప్పారు.. ప్రశాంతత కోల్పోయాం!
ABN, First Publish Date - 2023-08-07T17:09:19+05:30
ఆస్కార్ విజేత ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌కు బొమ్మన్ - బెల్లీ దంపతులు రూ.2 కోట్ల లీగస్ నోటీస్‌ను పంపించారు. సినిమా చిత్రీకరణ సమయంలో అన్ని విధాల సహాయం చేస్తానని మాటిచ్చి న కార్తికి మాట తప్పిందని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ఆస్కార్ విజేత (Oscar winner) ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The elephant whisperers) దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌కు బొమ్మన్ - బెల్లీ (Bomman -Belly) దంపతులు రూ.2 కోట్ల లీగస్ నోటీస్‌ను పంపించారు. సినిమా చిత్రీకరణ సమయంలో అన్ని విధాల సహాయం చేస్తానని మాటిచ్చి న కార్తికి మాట తప్పిందని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు సినిమాలో నటించినందుకు గానూ కలెక్షన్స్ నుంచి కొంత మొత్తాన్ని అందజేస్తామని కార్తికి తమకు చెప్పారని ఇచ్చిన మాట తప్పారని అన్నారు. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకుని తమకు మాత్రం మొండి చేయి చూపించారని నోటీస్‌లో పేర్కొనట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ విషయంపై స్పందించాలని ఓ మీడియా సంస్థ బొమ్మన్‌ను సంప్రదించగా.. కేసు కోర్టులో ఉన్నందువల్ల తాను మాట్లాడాలనుకోవడం లేదని, అవసరం అయితే తమ న్యాయవాదిని సంప్రదించమని తెలిపారు. (Kartiki Gonsalves)
తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతులు వాస్తవ జీవనం ఆధారంగా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అనే డాక్యుమెంటరీ తీశారు. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు వాటిని ఆదరించిన ఈ దంపతులే పాత్రధారులుగా ఈ కథ రూపుదిద్దుకుంది. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. గునీత్ మోగ్న నిర్మాత. 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2023 ఆస్కార్‌లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు అందుకొంది. అవార్డు అనంతరం కార్తికి తమను పట్టించుకోవడం లేదని బొమ్మన్ - బెల్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ వల్లే ఆస్కార్ వచ్చినప్పటికీ.. సన్మాన సభల్లో ఆ అవార్డును పట్టుకోనివ్వలేదన్నారు. ఈ చిత్రం తర్వాత ప్రశాంతత కోల్పోయామంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బొమ్మన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే? అయితే వీరి ఆరోపణలో నిజం లేదని నిర్మాణ సంస్థ పేర్కొంది.