Aishwarya Rai Bachchan: అలా విభజించడం నాకు రాదు!
ABN, First Publish Date - 2023-04-28T17:01:09+05:30
‘సినిమాను దక్షిణాది, ఉత్తరాది అని విభజించి నేను చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తా’’ అన్నారు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్.
‘‘సినిమాను దక్షిణాది, ఉత్తరాది అని విభజించి నేను చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తా’’ అన్నారు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్(Aishwarya Rai). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన ప్రశ్నకు దీటగాఆ సమాధానం చెప్పారు. నార్త్ సినిమా కన్నా, సౌత్ సినిమా (South and north Issue) పాపులారిటీ ఎక్కువగా ఉంది. ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందని అనుకుంటున్నారు. దీనిని మీరు అంగీకరిస్తారా? అన్న ప్రశ్న ఐశ్వర్యారాయ్‌కు (Aishwarya Rai brilliant Answer) ఎదురైంది. దీనికి ఆమె స్పందించారు. (ponniyin selvan 2 )
‘‘సినిమా రంగంలో ఒక ఇండస్ర్టీకి మరొక ఇండస్ర్టీకి మధ్య పోటీ సహజం. అలాగని కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది సినిమా అని విడదీసి చూడలేదు. మన దేశంలో ఏ భాషలో సినిమా వచ్చినా అది భారతీయ సినిమాగానే చూస్తా. ఏ భాష సినిమా హిట్టైన అది భారతీయ సినిమా హిట్‌గా చేస్తా. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే మాటల్ని నేను ఎప్పటికీ అంగికరించను. ఒకచోట అవకాశం రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే మరొక ఇండస్ర్టీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేేస ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. నాకు దక్షిణాదిలోనూ పెద్ద దర్శకులతో పనిచేేస అవకాశం వచ్చింది. మణిరత్నం, శంకర్.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను’’ అని అన్నారు. ఆమె సమాధానానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎవర్నీ నొప్పించకుండా సమాధానం చెప్పడం మీకే సాధ్యం మేడమ్’ అంటూ నెటిజన్లు ఐష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నందిని పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వరలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేశారు. శుక్రవారం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. (Maniratnam)