Aditi Rao Hydari : చిన్న పిల్లలా ఏడ్చానని తర్వాత అనిపించింది!
ABN, First Publish Date - 2023-10-21T17:13:32+05:30
ఓటీటీ రంగంలోని ప్రతిభావంతులను సత్కరించేందుకు ‘ఓటీటీ ఇండియా ఫెస్ట్’(OTT India Fest) ను ఇటీవల ముంబైలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో ఎంతో మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన అదితి రావు హైదరీ (Adithirao Hydari) తను నటించిన మలయాళ చిత్రం ‘సుఫియుమ్ సుజాతయుమ్’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైనప్పుడు ఏడ్చానని చెప్పుకొచ్చింది.
ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి థియేటర్లే కాకుండా ఓటీటీ మాధ్యమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పడు హవా మొత్తం డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద నడుస్తోంది. ఓటీటీ రంగంలోని ప్రతిభావంతులను సత్కరించేందుకు ‘ఓటీటీ ఇండియా ఫెస్ట్’(OTT India Fest) ను ఇటీవల ముంబైలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో ఎంతో మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన అదితి రావు హైదరీ (Adithirao Hydari) తను నటించిన మలయాళ చిత్రం ‘సుఫియుమ్ సుజాతయుమ్’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైనప్పుడు ఏడ్చానని చెప్పుకొచ్చింది. "నేను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేశా. లాక్‌డౌన్‌కు ముందు నా తమిళ చిత్రం ‘సైకో’ థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. అది రిలీజ్ అయినా కొన్ని రోజులకే లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఆ తర్వాత ‘సుఫియుమ్ సుజాతయుమ్’ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేేసందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం నాకు చెప్పినప్పుడు చాలా ఏడ్చాను. ఓటీటీలో వచ్చిన ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని చాలా భయపడ్డాను. కానీ ఆ చిత్రం కూడా అభిమానుల నుంచి అంతే ప్రేమను పొందింది. విదేశాల నటీనటులు, మలయాళం తెలియని వాళ్లు నాకు మెేసజ్‌లు చేశారు. దాదాపు ఓ 30 రోజులు ప్రశంసలతో మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అంత మంచి స్పందనను సొంతం చేసుకున్న ఆ చిత్రం గురించి చిన్న పిల్లలా ఎందుకు ఏడ్చానా? అని అనిపించింది(నవ్వుతూ)’ అంటూ తెలిపింది.