టాలీవుడ్ హీరో శర్వానంద్- సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితల వివాహం ఈ నెల 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జంట హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్‌ను జరుపుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన జంటను ఆశీర్వదించారు.