సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vishwak Sen: మాస్ కా దాస్ ఓటిటి డెబ్యూ ఎక్కడంటే...

ABN, First Publish Date - 2023-07-14T18:23:45+05:30

నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షో తరువాత ఆహా ఛానల్ వాళ్ళు ఇంకో నటుడిని ఇంకో వెరైటీ షో కోసం తీసుకువస్తున్నారు. ఇది ముందుగా 15 ఎపిసోడ్స్ ఉంటుంది అని చెపుతున్నారు. ఇంతకీ ఆ షో పేరేంటి, అందులో ఎవరుంటారు...

Vishwak Sen to debut on Aha OTT
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో యువ తెలుగు నటుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో డెబ్యూ చేయనున్నాడు. అతను మరెవరో కాదు, మాస్ కా దాస్ (MassKaDass) విశ్వక్ సేన్ (VishwakSen). త్వరలో 15-ఎపిసోడ్ లు వున్న ఒక షో తో ఆహా #Aha ఓటిటి ఛానల్ లో డెబ్యూ చేయనున్నాడు అని తెలిసింది. కొన్ని వారాల్లో ఈ షో ప్రారంభం కాబోతోందని, దీని మీద అధికారిక ప్రకటన త్వరలో ఆహా ఛానల్ నుండి రాబోతోందని తెలిసింది.

ఇదే ఆహా ఛానల్ ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణతో (NandamuriBalakrishna) 'Unstoppable' అనే రియాలిటీ షో చేసిన సగంతి తెలిసిందే. ఈ షో చాలా పెద్ద హిట్ అయిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పంథాలో ఇంకో నటుడు 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌', 'హిట్‌' (Hit), 'ఓరి దేవుడా', 'దాస్ కా ధ‌మ్కీ' (DasKaDhamki) వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యువ కథానాయ‌కుడు విశ్వ‌క్ సేన్‌ తో ఈ షో వుండబోతోంది అని తెలిసింది.

మంచి టాలెంట్ వున్న విశ్వక్ సేన్ మంచి నటుడుగా వెండి తెర మీద గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వైవిధ్యమైన పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. అలంటి విశ్వక్ సేన్ ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా అల‌రించ‌బోతున్నాడు అనే విషయంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ‌క్ సేన్‌ను చూడ‌న‌టువంట స‌రికొత్త అవ‌తార్‌లో ఆహా ఛానల్ ఆవిష్క‌రించ‌నుంది అని తెలిసింది. అందుకే మొదటి సీజన్ గా ఈ షోని 15 ఎపిసోడ్స్‌ గా సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Updated Date - 2023-07-14T18:23:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!