సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

ABN, First Publish Date - 2023-07-21T16:44:54+05:30

బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా.. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు‌గా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ఎ2బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న విడుదలైన ఈ చిత్రం హాస్య ప్రధాన చిత్రంగా ప్రేక్షకుల నుంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Unstoppable Poster

‘పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్ రత్నబాబు (Diamond Ratnababu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ (VJ Sunny), సప్తగిరి (Saptagiri) హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు‌గా నటించారు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్ రావు (Rajith Rao) ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న విడుదలైన ఈ చిత్రం హాస్య ప్రధాన చిత్రంగా ప్రేక్షకుల నుంచి స్పందనను రాబట్టుకుంది. అలాగే IMDBలో 7.8 రేటింగ్, బుక్ మై షోలో 8.2 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకోవడం విశేషం.


తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ‘అన్‌స్టాపబుల్’ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాస్య ప్రధాన చిత్రం కావడంతో ఓటీటీలో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు. కుటుంబం అంతా కూర్చుని హాయిగా ఈ చిత్రాన్ని చూసేలా దర్శకుడు తెరకెక్కించాడని, అందరినీ ఈ సినిమా అలరిస్తుందని నిర్మాత చెబుతున్నారు. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని, వాటి వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తానని నిర్మాత రంజిత్ రావ్ చెప్పుకొచ్చారు. (Unstoppable Released in OTT)

‘అన్‌స్టాపబుల్’ కథ (Unstoppable Story) విషయానికి వస్తే.. కోహినూర్ కళ్యాణ్ (సన్నీ) మరియు జిలాని రాందాస్ (సప్తగిరి) చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. డబ్బు సంపాదించడం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. అలా సంపాదించిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు. అత్యాశకు పోయి రూ. 10 లక్షలు అప్పు తీసుకొని మరి క్రికెట్ బెట్టింగ్‌లో పెడతారు. ఆ డబ్బులు మొత్తం పోతాయి. అప్పు ఇచ్చిన వాడు వెంటపడి వేధిస్తుంటే.. దుబాయి‌లో సెటిల్ అయిన ఫ్రెండ్ హానీ భాయ్ (షకలక శంకర్) దగ్గర 20 లక్షల అప్పు తీసుకుంటారు. అయితే హనీ భాయ్ ట్రాన్స్‌ఫర్ చేసిన అమౌంట్ వారి ఖాతాలలోకి రాకుండా.. మిస్టేక్ జ్ఞాన్ వేల్ రాజా అనే రౌడీ షీటర్ అకౌంట్‌లో పడతాయి. ఆ తర్వాత ఆ డబ్బులను అతని దగ్గర నుండి కళ్యాణ్, రాందాస్ ఎలా తీసుకున్నారనేదే కథ.


ఇవి కూడా చదవండి:

**************************************

*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

**************************************

*Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!

**************************************

*VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?

**************************************

*The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

**************************************

*Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

Updated Date - 2023-07-21T16:46:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!