కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే.. అన్నీ ఇంట్రెస్టింగ్ వే

ABN, First Publish Date - 2023-12-05T14:35:06+05:30

ఈవారం థియేటర్, ఓటీటీల్లో గట్టి చిత్రాలే సందడి చేయనున్నాయి. వీటిలో థియేట‌ర్ల‌లో హాయ్ నాన్న‌, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఓటీటీల్లో పొలిమేర‌2, జిగ‌ర్తాండ‌, జ‌పాన్‌ వంటి సినిమాలు ఉన్నాయి.

ott movies

ఈవారం థియేటర్, ఓటీటీల్లో గట్టి చిత్రాలే సందడి చేయనున్నాయి. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న (Hi Nanna) పాన్ ఇండియా స్థాయిలో తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ డిసెంబర్ 7 న విడుదల కానుంది. ఇప్పటికే నాని ఆయా రాష్ట్రాలలో పర్యటించి ప్రమోషన్స్ చేసి వచ్చాడు.

దీంతోపాటు నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ, కామెడీ జానర్ లో వస్తున్న ఎక్స్ట్రార్డినరీ మ్యాన్(Extra Ordinary Man ) డిసెంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెండింతలు పెంచేశాయి. క్రమంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ సినిమాను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అదేవిధంగా నాని నటించిన హాయ్ పాప Hi Papa, మనోజ్ బాజ్పాయ్ నటించిన సర్వైవల్, థ్రిల్లర్ జోరమ్(Joram), కస్తూరి ది మాస్క్ (Kastoori The Musk) అనే హిందీ (Hindi) సినిమాలు డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు వాంక (Wonka) అనే హాలీవుడ్ సినిమా థియేటర్లలోకి రానుంది.


ఇక ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలే స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముందుగా సత్యం రాజేశ్ నటించిన హర్రర్, థ్రిల్లర్ పొలిమేర 2 (Polimera2) డిసెంబర్ (December) 8న ఆహా (aha)లో స్ట్రీమింగ్ కానుంది. అదేవిధంగా కౌసే మునిస్వామి వీరప్పన్ (KooseMunisamyVeerappan ) అనే సిరీస్, కడక్‌ సింగ్‌ అనే సిరీస్ జీ 5 (ZEE 5)లో డిసెంబర్ (December)8 నుంచి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ జరుగనుంది.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్, ఎస్జే సుర్యా నటించగా ఇటీవల థియేటర్లలో విడుదలై కల్ట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న జిగర్తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) డిసెంబర్ 8 నుంచి, ఎన్నో అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చి డిజాస్టర్ గా నిలిచిన కార్తీ నటించిన సినిమా జపాన్ (Japan) డిసెంబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇటీవల బెంగాలిలో మంచి విజయం సాధించిన ఇందు సిరీస్ కు రిమేక్ గా అవికా ఘోర్ నటించిన వధువు వెబ్‌సిరీస్‌ డిసెంబరు 8వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ కానుంది. అదేవిధంగా చమక్‌ అనే వెబ్‌సిరీస్‌ డిసెంబరు 7 వ తేదీ నుంచి సోనీలివ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇక చివరగా దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయం చేస్తూ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస డిసెంబరు 5 నుంచి, జాకీష్రాప్ నటించిన మస్త్ మే రెహనే కా( Mast Mein Rehne Ka) అనే కొత్త హిందీ చిత్రం డిసెంబరు 8 నుంచి, అమెజాన్ ప్రైమ్ వీడియో Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. అదేవిధంగా కిల్లర్స్ ఆప్ మూన్ (Killers Of The Flower Moon ) అనే హాలీవుడ్ చిత్రం రెంట్ పద్దతిలో డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మో షో స్ట్రీమ్ లో ప్రసారం కానుంది.

Updated Date - 2023-12-05T14:39:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!