OTT: సైలెంట్ గా.. 6నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తేజ ‘అహింస’
ABN, First Publish Date - 2023-12-04T21:52:26+05:30
తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సోదరుడు అభారాంను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా అహింస. జూన్ 2 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా 6 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైంది.
తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సోదరుడు అభారాం(Abhiram Daggubati)ను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా అహింస(Ahimsa ). అనంది అర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ద్వారా గీతిక తివారి(Geethika Tiwary) హీరోయిన్ గా పరిచయం అవగా చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. జూన్ 2 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా 6 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైంది.
జయం, నువ్వు నేను వంటి ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న తేజ ఈ సినిమాను కూడా దాదాపు అదే తరహాలో తీశారు. అహింసను నమ్మే హీరో తను మరదలితో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఆమెపై అత్యాచారం జరగడం, మరదలిని దవాఖానలో చేర్చి, విలన్లపై న్యాయ పరంగా పోరాడుతూ సక్సెస్ అవుతున్న సమయంలో మరో విలన్ ఎంట్రీ ఇవ్వడం చివరకు హీరో విలన్లపై ఎలా పగ తీర్చుకున్నాడనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే సినిమా రోటీన్ గా ఉండడం, సాగదీత, కొత్త మోహలవడంతో సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోక పోగా నాలుగు రోజులకే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఓటీటీ యాజమాన్యాలు కూడా ఈ సినిమాపై అంతగా ఆసక్తి కనబర్చక పోవడంతో ఓటీటీలోకి రావడానికి సుమారు ఆరు నెలల పట్టింది. చివరకు సోమవారం (04.12.2023) సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video)లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు.