Vyavastha: 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్.. యూనిట్ స్పందనిదే!
ABN, First Publish Date - 2023-05-18T20:46:10+05:30
‘వ్యవస్థ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించడంతో.. ‘వ్యవస్థ’ టీమ్ సక్సెస్ మీట్ (Vyavastha Success Meet)ను నిర్వహించింది. ఈ మీట్‌కు హీరో
తాజాగా ఓటీటీ మాధ్యమం జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ లైబ్రరీలో చేరిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’ (Vyavastha). ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ (Director Anand Ranga) దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరి (Pattabhi Chilukuri)తో కలిసి రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించడంతో.. ‘వ్యవస్థ’ టీమ్ సక్సెస్ మీట్ (Vyavastha Success Meet)ను నిర్వహించింది. ఈ మీట్‌కు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరూ నాకు కావాల్సిన వారే. సంపత్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మలానీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. హెబ్బా పటేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ రత్నం అంటే చాలా ఇష్టం. తను వ్యవస్థలో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినందనలు. వారు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు బావుంది. ఇక దర్శకుడు ఆనంద్ రంగగారితో డీకే బోస్ చిత్రం నుంచి పరిచయం ఉంది. వ్యవస్థ సినిమాను ఎలా తెరకెక్కించారా? అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్’’ అని అన్నారు. (Vyavastha Success Meet)
తేజ కాకుమాను (Teja Kakumanu) మాట్లాడుతూ.. దర్శకుడు మా అన్నయ్యే కాబట్టి పెద్దగా పొగడాల్సిన పని లేదు. మా కార్తీక్, సంపత్ సార్, టీమ్ అందరినీ చూసి గర్వపడుతున్నానని అంటే.. కార్తీక్ రత్నం మాట్లాడుతూ.. సందీప్ కిషనన్ అన్నను కలిసి తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంపత్ రాజ్, అనిల్ సార్ అందరికీ థాంక్స్. హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కి థాంక్స్. జీ 5వారు చేస్తోన్న సపోర్ట్ మరచిపోలేం. చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ధన్యవాదాలని తెలిపారు.
దర్శకుడు ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుకనే మంచి ఔట్‌పుట్ వచ్చింది. కంటెంట్ మీ ముందే ఉంది. ఇక మీరే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు. ‘‘జీ 5, ఆనంద్ రంగాకి థాంక్స్. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తోంది’’ అని అన్నారు నిర్మాత పట్టాభి చిలుకూరి.
జీ 5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయితేజ దేశ్ రాజ్ (Saiteja Desh Raj) మాట్లాడుతూ ‘‘20 రోజుల ముందే చెప్పాం. వ్యవస్థతో హిట్ ఇస్తామని. హిట్ కాదు.. జీ5 కిది సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. రెక్కీ, పులి మేక.. ఇప్పుడు వ్యవస్థతో జీ 5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇంకా మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించబోతున్నాం’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ, సంపత్ రాజ్ వంటి వారు ఈ వెబ్ సిరీస్ సక్సెస్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?
*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది
*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట
*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్
*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం
*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..
*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..