Parking: పార్కింగ్ విషయంలో ఇగో ఫైటింగ్.. ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ డ్రామా!
ABN, Publish Date - Dec 29 , 2023 | 03:54 PM
ఓ అనువాద చిత్రం యమా స్పీడుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన థ్రిల్లర్ డ్రామా చిత్రం పార్కింగ్ ఈనెల (డిసెంబర్)30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగనుంది.
ఓ అనువాద చిత్రం యమా స్పీడుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన థ్రిల్లర్ డ్రామా చిత్రం పార్కింగ్ ఈనెల (డిసెంబర్)30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగనుంది. జెర్సీ (తెలుగు)ఫేం హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), ఇందూజ (Indhuja) రవిచంద్రన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రామ్‌కుమార్ బాలకృష్ణన్ (Ramkumar Balakrishnan) దర్శకత్వం వహించారు. ఎం.ఎస్.భాస్కర్(MS Bhaskar), రమ, ప్రార్థన కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందించగా ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేశారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) (Harish Kalyan) ఆధిక (ఇంధుజ) (Indhuja) జంట ఓ ఇంట్లో అద్దెకు దిగుతారు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఈశ్వర్ తన భార్య గర్భవతి కాడంతో ఆమెను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని ఓ కారును కొనుగోలు చేస్తాడు. అయితే మరో ఏడాదిలో రిటైర్ అవనున్న ప్రభుత్వ ఉద్యోగి ఇలంపరుతి (ఎం.ఎస్.భాస్కర్) పాత కాలం నాటి భావాలతో అవతలి వారి భావాలకు విలువ ఇవ్వకుండా ఇగోతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కారు పార్కింగ్ విషయంలో ఈశ్వర్‌కు ఓనర్‌తో తరుచూ గొడవలు జరుగుతూ ఒకరిని ఒకరు తీవ్రంగా కొట్టుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి వెళతారు.
డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా 30 రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నది. శనివారం (30.12.2023) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో తమిళంతో పాటు తెలుగు, మళయాళ, కన్నడ భాషల్లోను స్ట్రీమింగ్ అవనుంది. మరెందుకు ఆలస్యం సమయం, అవకాశం ఉన్న వారు ఏమాత్రం మిస్సవకుండా ఈ వీకెండ్ మీ మూవీ వాచింగ్ లిస్టులో యాడ్ చేసుకోండి, చూసేయండి.