కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT: ఈ వారం.. ఓటీటీలోకి డ‌బ్బింగ్ సినిమాల దండ‌యాత్ర‌! ఏకంగా డ‌జ‌న్‌కు పైగానే

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:39 PM

ఎప్ప‌టిలానే ఈవారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు చూసినోళ్ల‌కు చూసినంత నాన్స్టాప్ వినోదం అంద‌నుంది. అయితే ఈసారి ఒక‌టి రెండు కాకుండా ఏకంగా డ‌జ‌నుకు పైగా తెలుగులోకి డ‌బ్బింగ్ చేసిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు దండ‌యాత్ర చేయ‌నున్నాయి.

Hollywood

ఎప్ప‌టిలానే ఈవారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు చూసినోళ్ల‌కు చూసినంత నాన్స్టాప్ వినోదం అంద‌నుంది. ఆ జానర్ ఈ జాన‌ర్ అని కాకుండా దాదాపు ప‌ది భిన్న‌మైన చిత్రాలు సినీ అభిమానుల‌ను ఈ వారం అల‌రించ‌నున్నాయి. అయితే ఈసారి ఒక‌టి రెండు కాకుంండా ఏకంగా డ‌జ‌నుకు పైగా తెలుగులోకి డ‌బ్బింగ్ చేసిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు దండ‌యాత్ర చేయ‌నున్నాయి. ఇందులో మ‌న దేశంతో పాటు కొరియ‌న్ నుంచి అధికంగా డ‌బ్బింగ్ చేసినవి ఉన్నాయి. ఆ చిత్రాలేంటో.. ఏ ఏ ఫ్లాట్ ఫాంల‌లో వ‌స్తున్నాయో చూసేయండి.

విధార్థ్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన వ్యంగ్య హ‌స్య త‌మిళం చిత్రం కుయికో (Kuiko) ఈ రోజు(డిసెంబ‌ర్ 22) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

ప్ర‌ఖ్యాత హాలీవుడ్ డీసీ చిత్రాల ద్వారా డైరెక్ట‌ర్‌ జాక్ స్నైడర్ దర్శకత్వంలో రూపొందించిన రెబ‌ల్ మూన్ (Rebel Moon) అనే స్పేస్ ఆడ్వెంచ‌ర్ చిత్రం ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

ఈ మ‌ధ్యే ఒక్క‌ ఇంగ్లీష్ భాష‌లో మాత్ర‌మే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన‌ నో వేర్ (NoWhere (2023)) అనే స్పానిష్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ (Spanish Survival Thriller) ఇప్పుడు తెలుగుతో పాటు, త‌మిళ భాష‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

జియోంగ్ సోంగ్ క్రియేచ‌ర్ (Gyeong Seong Creature) అనే హిస్టారిక‌ల్, మిస్ట‌రీ, హ‌ర్ర‌ర్‌ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌స్తున్న కొరియ‌న్ సిరీస్(Korean Series) సీజ‌న్ 1 పార్ట్ 1 ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి కొరియ‌న్‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

కేర‌ళలో ఒకే ఫ్యామిలీలో జరిగిన ఆరుగురి అనుమానాస్ప‌ద హ‌త్య‌ల నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ర్రీ అండ్ సైనెడ్ ది జాలీ జోష‌ప్ కేస్‌ (Curry And Cyanide The Jolly Joseph Case) అనే డాక్యుమెంట‌రీ సిరీస్ ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి స్ట్రీమింగ్ మ‌ళ‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి అవుతున్న‌ది.

క‌న్న‌డ‌ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు, న‌టుడు రాజ్ బీ శెట్టి (Raj B Shetty) హీరోగా వ‌చ్చిన చిత్రం టోబీ (TOBY) . ఈ రోజు శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 22) నుంచి సోనీ లీవ్‌లో తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.


ఫియ‌ర్ ఆఫ్‌ ది నైట్ (Fear Of The Night (2023) అనే అమెరిక‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ల‌య‌న్స్‌గేట్ ప్లే (lionsgateplay IN)లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

సప్తసాగరాలు దాటి- సైడ్ బి (Sapta Sagaralu Dhaati (Side B) రిష‌బ్‌శెట్టి, రుక్మిణి వ‌సంత్ న‌టించిన ఫ్యామిలీ, ఎమోష‌న‌ల్ డ్రామా చిత్రం ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

క‌మ్ అండ్ హ‌గ్ మీ (Come And Hug Me (2018) అనే కొరియ‌న్ మిస్ట‌రీ రొమాంటిక్ డ్రామా సీరిస్ లోని 16 ఎపిసోడ్స్‌ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ (Prime VideoIN), అమెజాన్ మినీ టీవీ (Amazon mini TV)లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

షీ వాస్ ప్రెట్టీ (She Was Pretty (2015) అనే కొరియ‌న్ రొమాన్స్,కామెడీ, డ్రామా సిరీస్ (Korean Romance Comedy Drama)లో 16 ఏపిసోడ్స్‌ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime VideoIN), అమెజాన్ మినీ టీవీ (Amazon mini TV)ల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుదలై మంచి విజ‌యం సాధించిన త‌మిళ‌ చిత్రం 80 బిల్డ‌ప్‌ (80s Buildup). సంతానం హీరోగా న‌టించిన ఈచిత్రం త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Updated Date - Dec 22 , 2023 | 04:25 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!