కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT: ఓటీటీలోకి అరుదైన ఎమోషనల్, లవ్ డ్రామా.. ఎందులో, ఎప్పటినుంచంటే?

ABN, First Publish Date - 2023-11-29T09:05:32+05:30

ఇటీవల థియేటర్లలో విడుదలై కన్నడ, తెలుగు నాట మంచి సినిమాగా, కన్నడ మూవీ ఆఫ్ ది ఇయర్ పేరు తెచ్చుకున్న సప్తసాగరాలు దాటి సైడ్ బీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి జంటగా అరుదుగా వచ్చే ఎమోషనల్, లవ్, డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది.

SSE SideB

ఇటీవల థియేటర్లలో విడుదలై కన్నడ, తెలుగు నాట మంచి సినిమాగా, కన్నడ మూవీ ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకున్న సప్తసాగరాలు దాటి సైడ్ బీ (Sapta Sagaralu Dhaati) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రక్షిత్ శెట్టి (Rakshit Shetty), రుక్మిణి (Rukmini Vasanth) జంటగా అరుదుగా వచ్చే ఎమోషనల్, లవ్, డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 15న ఓటీటీలో విడుదల కానుంది. హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు హేమంత్ రావు (Hemanth Rao) రచన, దర్శకత్వం చేశారు. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ విడుదలైన రెండు నెలల్లోనే సైడ్ బీ కూడా విడుదలై విజయం సాధించడం గమనార్హం.

ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా స్లోగా రన్ అయినా అందులోని క్యారెక్టర్స్ , ఫీల్ చాలాకాలం గుర్తుండిపోయేలా ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి బాగం సైడ్ ఏలో హీరో ఓ బడా కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేస్తూ పాటలు పాడే తన ప్రేయసితో సంతోషంగా ఉంటూ, పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఓనర్ చేసిన యాక్షిడెంట్ ను తనపై వేసుకుని జైలుకు వెళ్లడం, తీరా లోపలికి వెళ్లాక బెయిల్ పై బయటకు తీసుకువస్తానన్న యజమాని గుండెపోటుతో చనిపోవడంతో హీరో జైలులోనే ఉండాల్సి రావడం, మధ్యలో పొయెటిక్ మాటలు, పాటలతో కథనం ఆధ్యంతం ఇట్రెస్టింగ్ గా సాగుతుండగా పార్ట్1 ముగించారు.


ఇక రెండో భాగం సైడ్ బీలో హీరో బయటకు రావడం, మరొకరిని పెళ్లి చేసుకున్న కథానాయిక గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక సంగర్షణ పడడం, ఆమె సంతోషంగా ఉందా లేదా అంటూ అనుక్షణం అమెనే గమనించడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా చూసే ప్రేక్షకుల గుండెనత్తుకునేలా సాగుతుంది. ఇప్పటికే మొదటి పార్ట్ సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, ఇప్పుడు సప్త సాగరాలు సైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ లో (Prime Video) డిసెంబర్ 15న స్ట్రీమ్ కానుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో మాత్రం మిస్సవకండి.

Updated Date - 2023-11-29T09:12:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!