OTT: సల్మాన్ అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి .. ఎందులో, ఎప్పటి నుంచంటే?
ABN, First Publish Date - 2023-12-02T19:52:33+05:30
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. YRF స్పై యూనివర్స్ లో భాగంగా టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం దీపావళి రోజూ థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ బయటకు వచ్చింది.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) , కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా నటించిన చిత్రం టైగర్ 3 (Tiger3). YRF స్పై యూనివర్స్ లో భాగంగా టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం దీపావళి రోజూ థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం ఈ చిత్రంగా ఈ రోజుకి రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టి మరెవరూ అందుకోలేని మరో కొత్త రికార్డును సల్మాన్ ఖాన్ ఖాతాలో వేసింది. వంద కోట్ల క్లబ్ లో చేరిన 17వ చిత్రంగా టైగర్ 3 నిలిచింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ బయటకు వచ్చింది. నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.పాకిస్తాన్ ప్రధానిని హత్య చేసి అధికారం చేజిక్కిచ్చుకుందామనే తీవ్రవాదులపై భారత గూఢాచారి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ప్రతి నాయకుడిగా బాటీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ నటించాడు. మనీష్ శర్మ (Maneesh Sharma) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మాత కాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ (Hritik Roshan) కూడా కనిపిస్తాడు. సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
దీపావళి రోజున ఆదివారం నాడు విడుదలైన ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకురాగా మొదటి రోజేఅత్యధిక కలెక్షన్లు రాబట్టి ఆల్ టైమ్ చరిత్ర సృష్టించింది. మొదటి రోజు హిందీ లో ఈ సినిమా రూ. 43 కోట్లు కలెక్టు చేసింది, అలాగే డబ్బింగ్ వెర్షన్ తెలుగు, తమిళం కలిపి రూ.1.50 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 44.50 కోట్లు, రెండు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన మూడో సినిమా ఈ 'టైగర్ 3'. ఇంతకు ముందు 'పఠాన్' (Pathaan), 'జవాన్' (Jawan) ఈ ఘనత సాధించాయి. ఇక తెలుగు, తమిళంలో ఈ సినిమా రెండో రోజు రూ.1.25 కోట్లు కలెక్టు చేసింది.