Rudramambapuram: థియేటర్లలో చూడాల్సిన సినిమా అట.. కానీ ఓటీటీలో!
ABN, First Publish Date - 2023-07-09T20:32:25+05:30
ఎన్‌వీఎల్ (NVL)ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం ‘రుద్రమాంబపురం’. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. ఈ చిత్రం ‘బలగం’ లాంటి చిత్రఅని, అయితే ‘బలగం’ చిత్రం ఒక కుటుంబ కథ అయితే, రుద్రమాంబపురం ఒక జాతి కథ.. అది ఒక్కటే తేడా.. అని అన్నారు చిత్ర నిర్మాత నండూరి రాము.
ఎన్‌వీఎల్ (NVL)ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం ‘రుద్రమాంబపురం’. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రలలో నటించారు. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. జూలై 6న ఈ సినిమా హాట్ ప్లస్ స్టార్‌లో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం ‘బలగం’ లాంటి చిత్రఅని, అయితే ‘బలగం’ చిత్రం ఒక కుటుంబ కథ అయితే, రుద్రమాంబపురం ఒక జాతి కథ.. అది ఒక్కటే తేడా.. అని అన్నారు చిత్ర నిర్మాత నండూరి రాము.
ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేసిన నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ.. ‘‘మా రుద్రమాంబపురం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు, అలాగే థియేటర్స్‌లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు. రుద్రమాంబపురం సినిమాకు రివ్యూస్ కూడా బావున్నాయి. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాము’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?
**************************************
*Deen Raj: ఎన్నో కష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం
**************************************
*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..
**************************************
*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?
**************************************
*BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!
**************************************