Tiger Nageshwara Rao OTT: ఓటీటీలోకి.. టైగర్ నాగేశ్వరరావు?ఎప్పటి నుంచంటే
ABN, First Publish Date - 2023-11-08T19:09:26+05:30
దసరా పండుగ కానుకగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమా రవితేజ టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమ్ కు తీసుకువస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దసరా పండుగ కానుకగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమా రవితేజ (Ravi Teja) టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwara Rao). స్టువర్టుపురం ఘరానాదొంగ గరిక నాగేశ్వరరావు నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు.
ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ల్యాగ్, అనవసర సన్నివేశాలు, టిపికల్ స్క్రీన్ ప్లే, నిడివి తదితర కారణాలతో పోటీ చిత్రం కేసరి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
ఈ క్రమంలో సినిమాను డిజిటల్ స్ట్రీమ్ కు తీసుకువస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో మేకర్స్ తో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్ 24న గానీ 30న గానీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈమధ్య కొన్ని సినిమాలు హెచ్డీ వెర్షన్ లో లీక్ అవుతుండడంతో సదరు ఓటీటీ సంస్థలు అనుకున్న సమయానికి ముందే తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు విడుదలైన లియో సోషల్ మీడియాలో లీక్ Hd వెర్షన్ లీకవడంతో ఓటీటీలో నవంబర్ 16నే విడుదల చేయనున్నట్లు సమచారం.