OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ ‘మంగళవారం’.. స్ట్రీమింగ్ అందులోనా?
ABN, First Publish Date - 2023-12-09T07:31:20+05:30
ఆరెక్స్100, మహా సముద్రం చిత్రాల తర్వాత అజయ్‌భూపతి దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఆరెక్స్100, మహా సముద్రం చిత్రాల తర్వాత అజయ్‌భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం(MangalaVaaram ). ఇంతవరకు మన దేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి రాని ఓ కొత్త, కాంట్రవర్సీ సబ్జెక్టును తీసుకుని తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ (paayal rajput) ను మెయిన్ లీడ్‌గా తీసుకుని చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో ఆడియెన్స్‌ను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కానీ ఫ్లాట్‌ఫామ్‌పై సందిగ్ధం ఏర్పడింది. ముందుగా ఆహా, నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవుతుందని వార్తలు రాగా తాజాగా ఆ రెండింటిలో కాకుండా డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలాఉండగా మంగళవారం(MangalaVaaram) సినిమాను ఇప్పటికీ థియేటర్‌కు వెళ్లి చూడలేని చాలా మంది సినీ అభిమానులు చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండగా చివరకు తేదీ బయటకు రావడంతో ఖుషీ అవుతున్నారు. ఎవరి అంచనాలకు అందని ట్విస్టులు, బ్యా గ్రౌండ్ మ్యాజిక్, స్టోరీ లైన్ తో ఈ సినిమా థియేటర్లలో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ఓటీటీలోనూ అదేవిధంగా చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.