O Saathiya: 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఓటీటీలో చిన్న సినిమా సంచలనం
ABN, First Publish Date - 2023-09-12T23:31:50+05:30
తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకంపై అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వంలో చందన కట్ట నిర్మించిన చితరం ‘ఓ సాథియా’. జులై 7వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.
తన్విక జశ్విక క్రియేషన్స్ (Thanvika Jashwika Creations) పతాకంపై అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన (Divya Bhavana) దర్శకత్వంలో చందన కట్ట (Chandana Katta) నిర్మించిన చితరం ‘ఓ సాథియా’ (O Saathiya). జులై 7వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్ట్రీమింగ్ మొదలైన మొదటి రోజు నుంచే ఓటిటి ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ స్ట్రీమింగ్‌తో అన్‌స్టాపబుల్‌గా దూసుకెళుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి వ్యూస్ సాధిస్తుండటం విశేషం. (O Saathiya In Amazon Prime Video)
‘‘ఓ సాథియా ఒక అందమైన ఎమోషనల్ ప్రేమ కథ. ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. అందుకే అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. మా ‘ఓ సాథియా’ చిత్రాన్ని థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్‌లో మీకు నచ్చిన భాషలో వీక్షించండి’’ అని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఈజే వేణు కెమెరామెన్‌గా పని చేయగా.. విన్ను సంగీతాన్ని అందించారు. అర్యాన్, దీపు ఈ చిత్రానికి కథను అందించారు.
ఇవి కూడా చదవండి:
============================
*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..
************************************
*Samyuktha Menon: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు
***********************************
*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?
**********************************
*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’
**********************************