Spy on OTT: నిఖిల్ స్పై సినిమా ఓటిటి లో వచ్చేసింది, ఎక్కడో తెలుసా...
ABN, First Publish Date - 2023-07-27T14:52:08+05:30
నిఖిల్ 'స్పై' సినిమా తొందరగానే ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఎటువంటి చప్పుడు లేకుండా, ఈ సినిమాని ప్రముఖ ఓటిటి ఛానల్ స్ట్రీమింగ్ చేసేసింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనక దాగి వున్న రహస్యం ఆధారంగా ఈ సినిమా కథ నేపధ్యం ఉంటుంది.
నిఖిల్ సిద్ధార్ధ (NikhilSiddhartha) నటించిన 'స్పై' #SpyMovie సినిమా జూన్ 29 న థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా విడుదలైంది, అలాగే దీనితో నిఖిల్ ఎంతో ఆశించాడు కానీ, అయన ఆశలును ఈ సినిమా ఒక విధంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రముఖ స్వతంత్ర వీరుడు సుభాష్ చంద్రబోస్ (SubhashChandrabose) మరణం వెనక వున్న రహస్యం ఆధారంగా ఈ సినిమా కథా నేపధ్యం వుంది అని ఈ సినిమా నిర్వాహకులు మొదటి నుండీ చెపుతూనే వచ్చారు. అయితే ఈ సినిమాలో మాత్రం దానికి సంబంధించి ఎటువంటి కొత్త సమాచారం ఇవ్వలేదనే చెప్పాలి. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ (GarryBH) దర్శకత్వం వహించాడు, ఇది అతనికి మొదటి సినిమా దర్శకుడిగా. రాజశేఖర్ దీనికి కథ, నిర్మాత కూడాను.
ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటిటి ఛానల్ అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) లో ఈ సినిమాని మీరు వీక్షించవచ్చు. ఈరోజు నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అని ఆ ఛానల్ అధికారికంగా తమ సాంఘీక మాధ్యమంలో ప్రకటించింది కూడా. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (IshwaryaMenon) కథానాయిక కాగా, ఇంకొక కథానాయికగా సాన్యా ఠాకూర్ (SanyaThakur) చేసింది. ఆర్యన్ రాజేష్ (AryanRajesh) ఇందులో ఒక చిన్న పాత్రలో కనపడతాడు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చూసుకోవచ్చు అని కూడా ఆ ఓటిటి ఛానల్ తెలియచేసింది.
ఇందులో రా సంస్థకి చెందిన జైవర్ధన్ స్పై గా నిఖిల్ కనపడతారు, అతనికి సహాయకులుగా అభినవ్ గోమాటం (AhinavGomatam), అలాగే ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్ లు కూడా ఇందులో స్పై లుగా కనపడతారు. నిఖిల్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ కూడా రా లో పనిచేస్తూ చనిపోతే, తన అన్నయ్యని ఎవరి చంపింది తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక పక్క ఉగ్రవాది ఖాదిర్ ఖాన్ కోసం కూడా నిఖిల్ టీము ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంతకీ తన అన్నయ్యని చంపింది ఎవరు, ఈ ఉగ్రవాదికి తన అన్నయ్య మరణానికి సంబంధం ఉందా, అసలు కథ ఏంటి అన్నది ఈ సినిమా నేపధ్యం.