OTT content: తాజా ఓటీటీలో విడుదలైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN, First Publish Date - 2023-01-03T09:20:04+05:30
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. అన్ని సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. అన్ని సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజా ఓటీటీలో విడుదలైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
ఫోన్ భూత్ (Phone Bhoot)
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన తాజా చిత్రం ‘ఫోన్ భూత్’. ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది ముఖ్యపాత్రలు పోషించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు. 4 నవంబర్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మౌస (Mousa)
ఒక ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఓ రోబోని తయారు చేస్తాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన సంఘటనల సమాహామే ‘మౌస’. పీటర్ మిమి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీం మహమూద్, అబ్దెల్ అజీజ్, ఈయాద్ నాసర్, మహమూద్ అబ్దెల్నాసర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ అరబిక్ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Power Rangers Dino Fury season 2 - హిందీ, ఇంగ్లిష్