Bigg Boss 7: ఆకేదైనా ఆకే కదరా, మేము సున్నం రాస్తాం అంటున్న శివాజీ, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ABN, First Publish Date - 2023-10-18T15:47:43+05:30
అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు రియాలిటీ షో లో రెండర్థాల మాటలు ఎక్కువయిపోయాయని నెటిజన్స్ తాజాగా విడుదలైన ప్రచార చిత్రం చూసి ట్రోల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో నిరంతరం స్ట్రీమింగ్ అవుతోంది. నాగార్జున (Nagarjuna) ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వారం వారం ఇంట్లో వున్న సభ్యులకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడు. అందుకోసం #BiggBossTelugu7 ఆ ఇంట్లో సభ్యులు అందరూ ప్రిపేర్ అవుతూ ఆ టాస్క్ ని పూర్తి చేస్తారు. ఈసారి ఒక వైవిధ్యమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పల్లెటూర్లలో వుండే సర్పంచ్, అమ్మాయి, పెళ్లికోసం అమెరికా నుండి వచ్చిన అబ్బాయి ఇలా చాలా వున్నాయి ఇందులో.
ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది అని అనుకున్నా, ఇందులో రెండర్థాల మాటాలు చాలా వున్నాయి. ఈ చిన్న ప్రచార చిత్రంలోని ఇన్ని రెండర్థాల మాటలు ఉంటే ఇక మామూలుగా అయితే ఎన్ని వుంటాయో అని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ ప్రచార వీడియో చూసి చాలామంది ఇది 'జబర్దస్త్' #Jabardasth షోకి పోటీగా వున్నట్టుగా వుంది అన్నారు.
ఈ టాస్కులో ప్రశాంత్ (Prashanth) 'అన్నా తిప్పేద్దునా' అని అంటే, ఆ అమ్మాయి 'ఏంటిరా నువ్వు నన్ను తిప్పేది' అని అంటుంది, దానికి సమాధానంగా 'నా చెంచా' అంటాడు ప్రశాంత్. ఇంతలో శివాజీ (Sivaji) వచ్చి ఊరుని ఒక ఊపు వూపుతున్నవటా కదా అని అడుగుతాడు. 'ఇంత అందగత్తెని మరి ఆమాత్రం ఊపనా ఏంటి' అని ఆమె అంటే, 'నీ అందం ఏంటో చూద్దాం తోటకి రా ఓసారి' అని అంటాడు శివాజీ. ఇలాంటి డైలాగ్స్ మరీ రెండర్థాల మాటల్లో వున్నాయి, మళ్ళీ వీటిని వినోదాత్మకం అంటారేంటి అని కూడా అంటున్నారు.
శివాజీతో ఇంకో సభ్యుడు 'ఓ పెద్దాయనా చాలా లేతాకు' అని అంటాడు. 'ఆకేదైనా ఆకే కదరా, మేము సున్నం రాస్తాం' అని శివాజీ అంటాడు. ఈ మాటల మీద సాంఘీక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.