Dasara: నాని ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
ABN, First Publish Date - 2023-04-20T14:44:50+05:30
థియేటర్లలో మోత మోగించిన దసరా చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను
న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన ‘దసరా’ (Dasara) చిత్రం మార్చి 30న థియేటర్లలో విడుదలై.. నాని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. నాని మొట్టమొదటి పాన్ ఇండియా (Pan India) సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా.. టోటల్‌గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. సుకుమార్ (Sukumar) శిష్యుడు, డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించారు. థియేటర్లలో మోత మోగించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.
నాని ఊర మాస్ లుక్‌లో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది (Dasara OTT Streaming Date). ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో.. ఇప్పుడంతా ఇదే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ మధ్య ఇండస్ట్రీలో జరిగిన చర్చల్లో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ జరగాలనేలా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం వెల్లడించిన తర్వాత.. ఎవరూ ఆ రూల్‌ని ఫాలో అవడం లేదు. ఈ మధ్యకాలంలో సినిమాలు విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ‘దసరా’ (Dasara Movie) కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల వచ్చిన ‘బలగం’ (Balagam) సినిమా కూడా థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తున్నా కూడా.. ఓటీటీలో విడుదల చేశారు. ఇప్పుడు దసరా పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇలాగే జరిగితే.. థియేటర్ల వ్యవస్థపై భారీ దెబ్బ పడే అవకాశం అయితే లేకపోలేదు.
ఇక ‘దసరా’ కథ (Dasara Story) విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) ఇద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు, అలాగే మిగతా స్నేహితులతో కలిసి ఆ వూరు మీదుగా వెళుతున్న బొగ్గు రైళ్లు నుండి బొగ్గు దొంగతనం చేస్తూ వుంటారు. వీళ్లిద్దరికీ ఇంకో స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేష్) ఉంటుంది. ఆమె అదే గ్రామంలో అంగన్ వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు, కానీ సూరి వెన్నెలని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ధరణి.. సూరి, వెన్నెలకి పెళ్లి అయేట్టు చూస్తాడు, స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు. అయితే అదే ఊర్లో సిల్క్ బార్ అని ఒకటుంటుంది, ఆ ఊరిలో వున్న మగవాళ్ళు అందరూ తాగుబోతులు. మందు పడకపోతే ముందుకు నడవరు. అదే ఊరిలో చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని), ఇంకా రాజన్న (సాయి కుమార్)లు అనే ధనికులు వుంటారు. ఆ ఊరి సర్పంచ్ పదవి కోసం ఈ సిల్క్ బార్ ఒక కీలకం అవుతుంది. ఇంతకీ ఆ సిల్క్ బార్ ఎందుకు అంత ప్రాముఖ్యం, ఆ ఊరి ప్రజలు ఎందుకు అంత తాగుబోతులు అయ్యారు, చిన్న కులం వాళ్ళని ఎందుకు బార్‌లోకి రానివ్వరు? తద్వారా ధరణి, సూరి, వెన్నెల జీవితాలలో ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ.
ఇవి కూడా చదవండి:
************************************************
*23YrsOfBlockBusterBadri: పవన్ కల్యాణ్ ‘బద్రి’ గురించి ఈ విషయం తెలుసా?
*Sai Dharam Tej: ‘విరూపాక్ష’ను ‘కాంతార’తో పోల్చవద్దు
*Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!
*OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..
*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు
*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?